అందాల భామ కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం రిలీజ్‌కు ముందు మంచి అంచనాలను క్రియేట్ చేసింది.కానీ థియేటర్లు లేకపోవడంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ఈ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో ఇప్పుడు చాలా మంది స్టార్స్ తమ సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.ఈ క్రమంలోనే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓటీటీలో తన చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సిద్ధమైంది.
బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘క్వీన్’ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ‘దటీజ్ మహాలక్ష్మీ’ చిత్రం ఎప్పుడో షూటింగ్ ముగించుకుంది.కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది.
దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఈ మేరకు ప్రముఖ ఓటీటీతో ఒప్పందం కూడా జరిగినట్లు తెలుస్తోంది.దీంతో త్వరలోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
అయితే ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.దీనికి బలమైన కారణం కూడా ఉంది.కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడం, అది కూడా ఓటీటీలో రిలీజ్ కావడంతో చిత్రం ఫెయిల్యూర్‌గా మిగిలింది.మరి దటీజ్ మహాలక్ష్మీ చిత్రం ఎలాంటి రిజల్ట్‌ను సాధిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.