24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు

దేశవ్యాప్తంగా రోజురోజూకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.పట్టణాల నుంచి పల్లెలకు వ్యాపించి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.

 Corona Tests At A Record Level In 24 Hours -breaking News, Latest News National-TeluguStop.com

అన్ని రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.ఈ మేరకు కరోనా పరీక్షలు విసృత్తంగా చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా రోజు అధిక సంఖ్యలో పరీక్షలు చేపడుతున్నారు వైద్యులు.ఇందులో భాగంగా గత 24 గంటల్లో 4,42,031 న‌మూనాల‌ను ప‌రీక్షించి, రికార్డు నమోదు చేసినట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది.

ఇంత పెద్ద‌ మొత్తంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం దేశంలో ఇదే మొద‌టి సార‌ని వెల్ల‌డించింది.

ప్ర‌భుత్వ ఆధ్వ‌‌ర్యంలోని ల్యాబుల్లో 3,62,153 న‌మూనాల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేసినట్లు వివరించింది.

ఇది కూడా ఒక రికార్డ‌ని తెలిపింది కేంద్రప్రభుత్వం.ప్రైవేట్ ల్యాబుల్లో ఒకేరోజు 79,878 న‌మూనాల‌ను ప‌రీక్షించినట్లు పేర్కొంది.

ఇక దేశంలో గ‌త 24 గంట‌ల్లో 32,223 మంది కోలుకున్నార‌ని కేంద్ర‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 8,49,431 మంది క‌రోనా నుంచి కోలుకున్నారని తెలిపింది.రిక‌వ‌రీ రేటు కూడా 63.54 శాతానికి పెరిగింద‌ని కేంద్రం వెల్ల‌డించింది.అదేవిధంగా దేశంలో యాక్టివ్‌కేసులు 3,93,360కి పెరిగినట్లు ప్ర‌క‌టించింది.అలాగే, ప్రజలు కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube