ఈ కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ సామాన్య, మధ్యతరగతి ప్రజల మీద ఎంత ప్రభావం చూపించిందో అందరికి తెలిసిందే.అయిన సాధారణ జీవితానికి అలవాటు పడ్డ ప్రాణాలు కాబట్టి వీళ్ళంతా ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ ని తట్టుకొని నిలబడ్డారు.
అయితే చాలా మంది రంగుల ప్రపంచంలో రోజు కూలీలపై బ్రతుకుతున్న బయటి ప్రపంచానికి ఎక్కువ సంపాదన ఉన్నట్లు కనిపిస్తారు.ఎన్నో కలలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చాలీచాలనీ సంపాదన వస్తున్న కచ్చితంగా మనకంటూ ఒక రోజు గుర్తింపు వస్తుంది.
అప్పుడు ఆదాయం అందరికంటే ఎక్కువగా వస్తుంది అని ఆశతో బ్రతుకుతూ ఉంటారు.అయితే ఈ లాక్ డౌన్ సమయం వారి కలలకి వారి ఆర్ధిక కష్టాలకి మరింత భారంగా మారిపోయింది.
దీంతో చెప్పుకోలేని స్థితిలో దుర్భరంగా సినిమా వాళ్ళ జీవితాలు మారిపోయాయి.
ఈ నేపధ్యంలో లాక్ డౌన్ ఆర్ధిక కష్టాలు వెరసి మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆ మధ్య కొంత మంది నటులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
తాజాగా మరో బుల్లితెర నటి ప్రేక్ష మెహతా ఆత్మహత్య చేసుకుంది.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తన నివాసంలో ఉరేసుకుని మరణించింది.అయితే ఆమె కుటుంబసభ్యులు గమనించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.కానీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు దృవీకరించారు.
కాగా ఆమె మరణించడానికి కొన్ని క్షణాల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో తన జీవితం గురించి పోస్ట్ పంచుకుంది.మీ కలలు నాశనమైనపుడు దానంత దరిద్రం మరొకటి ఉండదు అని ఆమె అందులో పేర్కొంది.
ప్రేక్ష మెహతా క్రైమ్ పెట్రోల్, లాల్ ఇష్క్, మేరీ దుర్గా వంటి పలు కార్యక్రమాల్లో నటించింది.ఇటు టీవీ ప్రేక్షకులనే కాకుండా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ప్యాడ్ మాన్‌లోనూ తళుక్కున మెరిసి సినీ ప్రేక్షకులనూ అలరించింది.
అయితే కేవలం ఈ లాక్ డౌన్ కష్టాలు తన కలలని నాశనం చేసాయనే మానసిక ఒత్తిడితోనే ఈమె ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.