దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్‌డౌన్ 4వ దశను తెలంగాణలోనూ అమలు పరుస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.తాజాగా కేబినెట్ సమావేశం నిర్వహించిన కేసీఆర్, మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4వ దశ లాక్‌డౌన్‌లో ప్రకటించిన సడలింపులను తెలంగాణలోనూ అమలు పరుస్తున్నట్లు తెలిపారు.
అటు కరోనా వైరస్ కేసులు ఉన్న కంటైన్‌మెంట్ ఏరియాల తప్ప మిగతా ఏరియాలను గ్రీన్ జోన్‌లుగా ప్రకటించారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడిపేందుకు కేసీఆర్ అనుమతిచ్చారు.
హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు.అయితే సామాజిక దూరాన్ని పాటిస్తూ బస్సులు నడుస్తాయని, ప్రతి బస్సులో శానిటైజర్ వాడాల్సిందిగా ఆయన ఆదేశించారు.
అటు ఆటోలు, క్యాబ్‌లు కూడా సోషల్ డిస్టెన్స్‌కు అనుగుణంగా నడుపుకోవచ్చని ఆయన అన్నారు.అటు కటింగ్ షాపులు, సెలూన్స్ కూడా తెరుచుకోవచ్చని ఆయన తెలిపారు.
ఇక ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.ముఖ్యంగా 65 ఏళ్ల పైడిన వారు బయటకు రాకుండా ఉండటమే ఉత్తమమని ఆయన అన్నారు.మొత్తానికి ఆర్టీసీ బస్సులు రోడెక్కుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కానీ సామాజిక దూరం పాటించకపోతే తమ ఆరోగ్యానికే హానికరం అని పలువురు అంటున్నారు.
ఇక మిగతా సడలింపులపై కూడా సీఎం కేసీఆర్ పాజిటివ్‌గా స్పందించారు.