టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆచార్య అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు.ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ పనులు కూడా మొదలయ్యాయి.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇందులో ముఖ్యంగా ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని, దాదాపు 30 నిమిషాల నిడివి గల సన్నివేశాల్లో చెర్రీ నటిస్తున్నట్లు సమాచారం.
అలానే ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ప్రస్తుతం వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న రష్మిక మందన్న నటిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

అంతేగాక ఈ సినిమాలో రష్మిక మందన్న పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేక పోయినప్పటికీ పారితోషికం విషయంలో మాత్రం బాగానే డిమాండ్ చేస్తోందని పలువురు సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.అయితే ఈ చిత్రం షూటింగ్ మొదలై దాదాపు 45 శాతం చిత్రీకరణ పూర్తి అయినప్పటికీ ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే హీరోయిన్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ సభ్యులు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.ఈ కారణంగా కొంత మేర మెగాస్టార్ చిరంజీవి అభిమానులు దర్శకుడు కొరటాల శివ పై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే మరో తమిళ చిత్రంలో కూడా నటించేందుకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అయితే తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను మాత్రం అనతి కాలంలోనే దక్కించుకొని బాగా ఎంజాయ్ చేస్తోంది.