తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించినటువంటి “రంగస్థలం” అనే చిత్రం ఎంత మంచి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందో అందరికీ బాగా తెలుసు.అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించగా హీరోయిన్ గా టాలీవుడ్ గ్లామర్ డాల్ అక్కినేని సమంత నటించింది.
అలాగే ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ హీరో జగపతి బాబు, ఆది పినిశెట్టి, సీనియర్ నటుడు నరేష్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.అయితే ఇందులో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి అక్కినేని సమంతను ముందుగా రిజెక్ట్ చేశానని తెలిపాడు.
అయితే ఒక చిత్రంలో ఇద్దరు స్టార్లను సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోతే పలు సమస్యలు వస్తాయని భావించి సమంతను రిజెక్ట్ చేసినట్లు కూడా చెప్పుకొచ్చాడు.కానీ సమంత నటన మాత్రం అద్భుతమని, ఆమె ఒక్కో సన్నివేశంలో పల్లెటూరు యువతి పాత్రలో చక్కగా ఒదిగిపోయి ఈ చిత్రంలో తన పాత్రకి వంద శాతం న్యాయం చేసిందని తెలిపాడు.
అంతేగాక ఒక్కో సన్నివేశంలో సమంత నటించిన తీరు మరియు హావభావాలను పలికించే తీరు తన చెంప చెల్లుమనిపించిందని సరదాగా చెప్పుకొచ్చాడు.2018 సంవత్సరంలో మార్చి 30వ తారీఖున విడుదలైన టువంటి రంగస్థలం చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.అంతేకాక దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.మరోపక్క ఈ చిత్రంలోని సంగీతం కూడా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా సుకుమార్ ప్రస్తుతం “పుష్ప” అనే యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తుండగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన పోస్టర్లు విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.