అవకాశాలు లేనీ తమ్మూ.. ఏం న్యూస్ రా బాబు అంటోన్న బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్‌లో దశాబ్ధ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

వరుసగా సినిమా అవకాశాలను అందుకోవడమే కాకుండా ప్రేక్షకులు మెచ్చే పాత్రల్లో అమ్మడు నటించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

ఇక ఈ మధ్య కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరు హీరోలతో నటిస్తోంది.ఇక అవకాశం దొరికినప్పుడల్లా ఐటెం సాంగులతోనూ ఆకట్టుకుంది మిల్కీ బ్యూటీ.

అయితే ఇప్పుడు ఇదే ఆమెపై పలు రకాల వార్తలు రావడానికి కారణమైంది.ఇటీవల సరైన హిట్లు లేకపోవడంతో సతమతమవుతున్న తమన్నాకు ఇప్పుడు సినిమా అవకాశాలే లేవని వార్తలు వినిపిస్తున్నాయి.

అటు బాలీవుడ్‌లోనూ అరకొర సినిమాలు చేసిన ఈ బ్యూటీ టాలీవుడ్ చిత్రాల కారణంగా బాలీవుడ్‌ను దూరం చేసుకుందని, ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా అవకాశాలు లేవని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ వార్తలు తమన్నా వరకు చేరడంతో అవాక్కవ్వడం ఆమె వంతయ్యింది.

Advertisement

అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకువస్తాయా అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.బాలీవుడ్ కంటే కూడా తనకు దక్షిణాదిన అవకాలు ఎక్కువగా ఉన్నాయని, దీనికి తను సంతోషంగా ఉన్నానంటూ తమన్నా చెప్పుకొచ్చింది.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు