సూపర్ స్టార్ మహేష్ బాబు బావా అనే ట్యాగ్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎక్కడ కూడా అతని ఇమేజ్ వాడుకోకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సుదీర్ బాబు సొంతం చేసుకున్నాడు.రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అని కాకుండా కొత్తకథలతో ప్రేక్షకుల ముందుకి వస్తూ నటుడుగా తనదైన ముద్ర వేసాడు.
ఇప్పుడు ఉన్న యువ హీరోలలో సుదీర్ బాబు అంటే డిఫరెంట్ కంటెంట్ సినిమాలు అనే బ్రాండ్ ఉంది.ప్రస్తుతం నానితో కలిసి వి అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రావడానికి సుదీర్ బాబు సిద్ధం అవుతున్నాడు.
తాజాగా సుదీర్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హిందీలో బ్రహ్మాస్త్ర చిత్రంలో కూడా నటించే అవకాశం వచ్చిందని చెప్పాడు.హిందీలో భాగీ సినిమాలో విలన్ గా నటించడంతో అక్కడ మంచి గుర్తింపు వచ్చింది.
అదే ఆ సినిమా కారణంగా బ్రహ్మాస్త్ర మూవీలో కూడా అవకాశం వచ్చింది.అదే సమయంలో గోపిచంద్ బయోపిక్ మీద వర్క్ చేస్తున్నాం.
దానికోసం బరువు కూడా తగ్గాను.అయితే సినిమా కోసం ఏకంగా 90 రోజులు కాల్ షీట్స్ అడగడంతో బయోపిక్ కి ఇబ్బంది అవుతుందని భావించి డ్రాప్ అయిపోయా అని చెప్పాడు.
అయితే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బయోపిక్ పై చాలా కాలంగా వర్క్ జరుగుతున్నా ఇప్పటి వరకు ఎందుకు తెరకెక్కించ లేదు అనే విషయం మాత్రం సుదీర్ బాబు క్లారిటీ ఇవ్వలేదు.