ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది.ఇక నామినేషన్ల పర్వం కూడా మొదలయ్యింది.
అయితే ఇప్పుడు ఈ ఎన్నికలు అధికార పార్టీ వైసీపీకి, ఇటు టీడీపీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి.జగన్ తొమ్మిది నెలల పాలనపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి.
కొంత వరకు ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కూడా వ్యతిరేకత ఎక్కువగా ఉంటే మాత్రం ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది.ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీగా బలం నిరూపించుకొని అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి చంద్రబాబుకి ఇది మంచి అవకాశం.
అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు మాటతీరు చూస్తూ ఉంటే ఇంకా జరగకముందే చేతులు ఎత్తేస్తున్నట్లు ఉంది.స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్ధులని నిలబెడతామని, అభ్యర్ధులు లేని చోట ప్రజలే ముందుకొచ్చి నిలబడితే వారికి టీడీపీ అండగా ఉంటుందని మాట్లాడారు.
దీనిని బట్టి చాలా చోట్ల టీడీపీ నేతలు పోటీ చేయడానికి ముందుకి రావడం లేదనే మాట వినిపిస్తుంది.ఇప్పుడే వైసీపీ అధికారం అడ్డుపెట్టుకొని దాడులు చేస్తుందని, ఈ నేపధ్యంలో పోటీలో దిగితే ప్రాణాలకి ప్రమాదం తలపెట్టిన ఎవరు కాపాడేవారు ఉండరని చాలా మంది భావించి వెనక్కి తగ్గుతున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
ఏది ఏమైనా అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాల్సిన ప్రతిపక్షం ఆరంభంలోనే చేతులు ఎత్తేయడం చూస్తూ ఉంటే ఈ ఎన్నికలలో అధికార పార్టీ బెదిరింపులు ఎక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.