భక్త కన్నప్పని పక్కన పెడుతున్న మంచు విష్ణు

మంచు విష్ణు హీరోగా కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి డీ సినిమా స్థాయిలో సాలిడ్ హిట్ ఇప్పటి వరకు అందుకోలేదు.తానే నిర్మాతగా మారి సినిమాలు తెరకెక్కిస్తున్న సక్సెస్ మాత్రం అందడం లేదు.

 Manchu Vishnu To Turn Bhakta Kannappa-TeluguStop.com

ఏదో అయితే ఎవరేజ్, లేదంటే ఫ్లాప్ అనే మాదిరిగానే అతని సినిమాలు ఉన్నాయి.ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం మోసగాళ్ళు అనే ఒక పాన్ ఇండియా మూవీని విష్ణు చేస్తున్నాడు.

ఈ సినిమా హాలీవుడ్ దర్శకుడు తెరకేక్కిస్తున్నాడు.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని తెలుగుతో పాటు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే తనికెళ్ళ భరణి దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా భక్త కన్నప్ప మూవీ తెరకెక్కించాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ సినిమా బడ్జెట్ మొత్తం చూసుకుంటే 95 కోట్ల వరకు వచ్చిందని తాజాగా విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఇంత బడ్జెట్ తో సినిమాని హ్యాండిల్ చేయలేనని తనికెళ్ళ భరణి తప్పుకున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చేసారు.దీంతో హాలీవుడ్ టెక్నిషియన్స్ తో సినిమాని ప్లాన్ చేస్తున్నామని అయితే తనకున్న మార్కెట్ దృష్టిలో పెట్టుకొని 95 కోట్లు అంటే చాలా ఎక్కువ కాబట్టి, అంత బడ్జెట్ తన మీద పెట్టడం కూడా కరెక్ట్ కాదని అనుకుంటున్నట్లు చెప్పాడు.

ఈ నేపధ్యంలో ఈ సినిమాని కొంత కాలం పక్కన పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube