మిర్యాలగూడ ప్రణయ్-అమృత ప్రేమ కథ తెలుగు ప్రజలందరికీ తెలుసు.కులాంతర వివాహం చేసుకుందని తండ్రి కూతురు భర్తని ఆమె కళ్ళ ముందే అతి కిరాతకంగా కోటి రూపాయిలు సుపారీ ఇచ్చి చంపించేసాడు.
ఇదిలా ఉంటే ఈ కథలో మరో ట్విస్ట్ తరహాలో కూతురికి తన ప్రేమని దూరం చేసిన అమృత తండ్రి మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.కూతురు మీద ప్రేమతోనే మనోవ్యధకి గురై అతను చనిపోయినట్లు సూసైడ్ నోట్ ఆధారంగా తెలుస్తుంది.
అయితే మారుతీరావు చనిపోయిన కూడా అమృత అతను చేసిన తప్పు క్షమించరానిదే అనే విధంగా ప్రవర్తిస్తుంది అనే టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ప్రణయ్-అమృత ప్రేమ కథ స్ఫూర్తితో తెలుగులో ఒక సినిమా తెరకెక్కింది.
ఈ విషయాన్ని ఆ సినిమాలో హీరోగా నటిస్తున్న బాలాదిత్య తెలియజేశారు.వారి ప్రేమ కథ స్ఫూర్తితో చాలా భావోద్వేగాలతో అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమాని దర్శకుడు నాగేశ్వరరావు తెరకెక్కించారని తెలిపారు.
దీనికోసం చాలా రీసెర్చ్ చేయడం జరిగిందని అన్నారు.ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుందని తెలిపాడు.
మరి నిజ జీవిత కథల స్ఫూర్తితో వస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ అవుతున్నాయి.ఆ కోవలో ఇది కూడా మంచి సక్సెస్ అందుకుంటుంది ఏమో చూడాలి.