తెలుగు సినీ పరిశ్రమలో దాదాపుగా స్టార్ హీరోలతో నటించినటువంటి అతికొద్ది మంది హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు.అంతేగాక వచ్చినటువంటి అవకాశాలను చక్కగా వినియోగించుకుంటూ వరుస హిట్ చిత్రాలతో తెలుగులేని హీరోయిన్ గా టాలీవుడ్ లో దూసుకుపోతోంది.
అయితే తాజాగా ఈ అమ్మడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన టువంటి అల వైకుంఠపురములో అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన మొహంజదారో అనే చిత్రంలో నటించింది.అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.దీంతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి మకాం మార్చి తన అందం, నటనతో స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది ఈ అమ్మడు. ఒకపక్క సినిమాలు మరో పక్క ఫోటో షూట్లతో ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతోంది.
అయితే పూజ హెగ్డే ఇప్పటికే సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.
అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రంలో అక్కినేని హీరో అఖిల్ హీరోగా నటిస్తున్నాడు.అంతేగాక పూజా హెగ్డే రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న జాన్ అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది.
అయితే రెండు చిత్రాల తర్వాత తెలుగులో పూజా హెగ్డే ఇంకో చిత్రంలో నటించేందుకు ఒప్పుకోలేదు.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు దృష్టి బాలీవుడ్ వైపు మళ్ళినట్లు తెలుస్తోంది.