తమిళ సూపర్ స్టార్ విజయ్ ను ఇటీవల మాస్టర్ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో షూటింగ్‌ను నిలిపేసి మరీ ఐటీ అధికారులు ప్రశ్నించేందుకు తీసుకు వెళ్లిన విషయం తెల్సిందే.విజయ్ను షూటింగ్ నుండి అర్థాంతరంగా తీసుకు వెళ్లినందుకు గాను ఫ్యాన్స్ రెండు రోజులుగా రచ్చరచ్చ చేస్తున్నరు.
ఇదే సమయంలో ఐటీ అధికారులు అవాకయ్యే విషయాలు చెప్పడంతో ఫ్యాన్స్ కూడా నోరు వెళ్లబెడుతున్నారు.
విజయ్ ఏకంగా 100 కోట్ల రూపాయల పన్నును చెల్లించకుండా తప్పుడు లెక్కలు చూపించాడట.బిగిల్ సినిమా కోసం నిర్మాత తీసుకున్న పారితోషికంను సగానికి తగ్గించి చెప్పడంతో భారీగా పన్ను ఎగ్గొట్టాడట.అదే సమయంలో విజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులకు నగదు, బంగారంతో పాటు పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యం అయ్యాయట.
విజయ్ ఆదాయానికి మించిన ఆస్తులు భారీగా ఉన్నాయని, వాటికి పన్ను కట్టకుండా రహస్యంగా ఉంచుతున్నాడు అంటూ ఐటీ అధికారులు తేల్చి చెప్పడంతో అంతా అవాక్కవుతున్నారు.
రాజకీయాలను మాట్లాడుతూ గొప్పవాడిగా చెప్పుకుంటూ సినిమాల్లో నీతిమంతుడిగా కనిపిస్తూ నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకుంటాడు అంటూ విజయ్‌కి మంచి పేరు ఉంది.అలాంటి విజయ్ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంకు వంద కోట్ల రూపాయల పన్నును ఎగ్గొట్టేందుకు తన ఆదాయాన్ని అంతా దాచేసినట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.దాంతో ఇప్పుడు ఆయన అభిమానులు కూడా ఆయన తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు ఈ విషయమై విజయ్ నుండి ఎలాంటి స్పందన రాలేదు.