టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సీబీఐ ఓ కన్నేసి ఉంచిందనే వార్తలు ఇప్పుడు రాజకీయవర్గాలలో కాక రేపుతున్నాయి.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలల్లో ఈ వ్యాఖ్యలు గుబులు రేపుతున్నాయి.
అసలే టీడీపీ నావ సముద్రం మధ్యలో ఉంది.చంద్రబాబు ఈ నావని ఎంతో కష్టంమీద నడుపుతున్నాడు.
ఈ క్రమంలో ఒకవేళ బాబు జైలు కెళ్తే పార్టీ పరిస్థితి ఏమిటి అనే అందోళన కలుగుతోంది ప్రతీ ఒక్కరిలో.సరే ఈ విషయం కాసేపు పక్కన పెడితే.
సీబీఐ మాత్రం ఈ సారి చంద్రబాబు చుట్టూ గట్టిగా ఉచ్చు బిగించిందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది అంటున్నారు పరిశీలకులు.
రాజధాని పేరు చెప్పి అప్పట్లో టీడీపీ నేతలు ఎవరెవరు ఎన్నెన్ని భూములు కొనుగులు చేశారు అనే విషయం వైసీపీ నేతలు ఇచ్చిన ప్రజంటేషన్ అందరూ చూసిందే.
ఈ విషయంపై సిబీఐ విచారణ వేసిన ప్రభుత్వం ఏ ఒక్కరిని వదలద్దని కీలక ఆదేశాలు జారీచేసింది.ఇప్పటికే ఢిల్లీ వేదికగా ఈ దర్యాప్తుకి మరింత బలం చేకూరేలా వైసీపీ పావులు కదుపుతోంది.
కేంద్ర దర్యాప్తు సంస్థలు వేస్తున్న అడుగులు చూస్తుంటే సీబీఐ ఈ భూముల కొనుగోలు విషయంలో దూకుడుగానే ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.అయితే
గత కొన్ని రోజులుగా రాజధాని భూముల విషయంలో అసలేం జరిగింది అంటూ లోతైన విచారణ చేపట్టిన సిఐడీ ఇన్ ట్రేడింగ్ లో మనీ ల్యాండరింగ్ జరిగిందనే భావనతో దీనిపై మరింత లోతైన దర్యాప్తు చేయాలని ఈడీ కి ఆదేశాలు జారీ చేసిందట.అంతేనా కేసు నమోది చేసిన మరీ దర్యాప్తు బృందాలని రంగంలోకి దించడానికి సిద్దంగా ఉందట.ఈ సందర్భంలోనే ఈడీ కేసు నమోదు చేసిన రోజే లోక్ సభలో మిదున్ రెడ్డి చంద్రబాబు హయాంలో జరిగిన ఇన్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణ జరగాలని కోరారు.
ఈ క్రమంలోనే ఒకే సారి సిఐడీ ని రంగంలోకి దింపిన జగన్ సర్కార్, వెనువెంటనే ఈడీని కూడా రంగంలోకి దించేసింది.ఒక పక్క ఈడీ, మరో పక్క సిఐడీ రెండూ కూడా బాబు హయాంలో జరిగిన నేరాలపై లోతైన దర్యాప్తు చేసి ఉచ్చు బిగించే పనిలో పడ్డాయి.
మరి ఈ రెండు దర్యాప్తు సంస్థలని 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఎలా తిప్పి కొడుతారో వేచి చూడాలి అంటున్నారు నిపుణులు.