యాంగ్రి స్టార్ రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.గరుడవేగ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న రాజశేఖర్, ఆ తరువాత గ్యాప్ తీసుకుని కల్కి సినిమాలో నటించాడు.
ఈ రెండు సినిమాల్లో నటించిన రాజశేఖర్, ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని లైన్‌లో పెట్టే పనిలో ఉన్నాడు.ఇప్పటికే పలు స్క్రిప్టులు విన్న రాజశేఖర్, తాజాగా ఓ కథను ఓకే చేసినట్లు తెలుస్తోంది.
గతంలో అహ నా పెళ్లంట, పూలరంగడు వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వీరభద్రం డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని రాజశేఖర్ సైన్ చేసినట్లు తెలుస్తోంది.ఓ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథగా తెరకెక్కబోయే ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపారు.
ఈ సినిమాను మార్చి నెలలో స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మరి ఈ సినిమాతో రాజశేఖర్ వెయిట్ చేస్తున్న సక్సెస్ అందుకుంటాడా లేడా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమాలో నటీనటులు ఎవరనే విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.మరి ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందో చూడాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.