గులాబ్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.దీంతో రాష్ట్ర ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో.బాధితులకు అండగా ఉండాలని వారిని ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తుఫాన్ పీడిత ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి సాయం కావలసి వచ్చినా.పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకెళ్లాలని సమాచారం ఇవ్వాలని.చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
చాలా వరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీగా.ఈదురు గాలులు వీస్తూ ఉండటంతో విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేపగుంట లో.ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడి.మహిళా మృతి చెందడం జరిగింది.
గులాబ్ తుపాను ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర తో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో బలంగా ఉంది. రాయలసీమ జిల్లాలలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలో.ప్రభుత్వం కూడా ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయడం జరిగింది.