మరో వివాదంలో ఇరుక్కున్న ట్రంప్...!!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు చెప్తే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది, ఆయన ఫన్నీ కామెంట్స్ అలాగే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే తీరు.అలాగే వీసాల విషయంలో విధించే నిభందనలు.

 Trump Pretends Doing Orchestra During National Anthem-TeluguStop.com

ఇవి కాకుండా ట్విట్టర్ లో ఆయన చేసే కామెంట్స్.ఇలా రకరకాలుగా ట్రంప్ పేరు తలువగానే అన్నీ గుర్తుకు వచ్చేస్తాయి.

ఎప్పుడూ వివాదలని మెడలో వేసుకుని తిరిగే ట్రంప్ ఇదొక తుంటరి పనిచేయడం అలావాటే.
గతంలో బ్రిటిష్ రాణిని కలిసిన సందర్భంలో సైతం ట్రంప్ వివాదంలో చుక్కుకున్నాడు.

తాజాగా మరోసారి తుంటరి పనిచేస్తూ మరొక వివాదంలో చిక్కుకున్నాడు ట్రంప్.అదేంటంటే.

జాతీయ గీతం అంటే అందరికి ఎంతో గౌరవ ప్రదమైన గేయం.జాతీయ గీతాలు వచ్చే సమయంలో ప్రతీ ఒక్కరూ ఎంతో నిబద్ధతతో గౌరవ వందనం ఇస్తూ తమ దేశ భక్తిని చాటుతారు.కానీ ట్రంప్ అందుకు విరుద్దంగా ప్రవర్తించాడు…

Telugu British Queen, Donald Trump, National Anthem, Trumppretends-

   ఓ కార్యక్రమానికి వెళ్ళిన ట్రంప్ అక్కడ జాతీయ గీతం వస్తుండగా అందరూ నిలబడి గౌరవ వందనం ఇస్తుంటే, ట్రంప్ మాత్రం ఆర్కెస్ట్రా వాయిస్తున్నట్లుగా ఇమిటేట్ చేస్తూ అక్కడ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయాడు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది.బ్లాక్ సూట్ వేసుకున్న ట్రంప్ రెడ్ టై కట్టుకుని కచేరి చేసేవాడిలా చేతులు ఊపుతూ ప్రవర్తించిన తీరు నవ్వు తెప్పించడమే కాకుండా అమెరికా కాంగ్రెస్ కి ఆగ్రహం కూడా తెప్పించింది.జాతీయ గీతం వస్తుంటే ఇవేమీ వేషాలు అంటూ చీవాట్లు పెట్టింది.

దాంతో అమెరికన్లు అందరూ ట్రంప్ పై ఆగ్రహాన్ని ప్రదరిస్తున్నారు.అధ్యక్షుడిగా ఉంటూ మన జాతీయ గీతాని అవమానపరుస్తావా అంటూ ఫైర్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube