ప్రస్తుతం చైనాను కరోనా వైరస్ ఒణికిస్తున్న విషయం తెల్సిందే.ప్రపంచం మొత్తం ఇప్పుడు చైనా వల్ల ఆ వైరస్ బారిన పడే పరిస్థితి వచ్చింది.
దాదాపుగా పాతిక దేశాల్లో ఈ వైరస్ గుర్తించడం జరిగింది.అన్ని దేశాల్లోకి కూడా చైనా నుండి వ్యాప్తి చెందినట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కరోనా వైరస్ వల్ల ఇప్పటికే చైనాలో దాదాపుగా 600 మంది చనిపోయినట్లుగా సమాచారం అందుతోంది.ఇక కరోనా వైరస్ కారణంగా చైనాలోని పలు నగరాలు పూర్తిగా బహిష్కరించబడ్డాయి.
అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు లక్ష మంది కరోనా బారిన పడ్డట్లుగా సమాచారం అందుతోంది.కరోనా వైరస్‌కు మందు అత్యంత స్పీడ్‌గా కనిపెట్టకుంటే ఆ లక్షమంది ప్రాణాలు గాల్లో కలిసి పోతాయేమో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.
ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదు అంటున్నారు.ఇక చైనాలో కరోనా వైరస్‌కు ప్రధాన కారణం ఆ దేశపు ప్రజల ఆహారపు అలవాట్లే అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని విధంగా వింత ఆహారపు అలవాట్లను వారు కలిగి ఉన్నారు.అందుకే ఈ పరిస్థితి అంటున్నారు.
ఇప్పటి వరకు చైనా వారు పాములు, కప్పలు, పీతలను మాత్రమే తింటారని అనుకున్నాం.కాని అంతకు మించి అత్యంత అసహ్యకరమైన వాటిని కూడా వారు తింటారట.దోమలు, ఈగలు, కీటకాలు, బొద్దింకలు, నల్లులు, పేనులు, పురుగులు, పంది కొవ్వు ఇంకా ఏ పురుగును కూడా వదిలేయకుండా వేయించుకుని తింటున్నారట.ఇక కొన్ని రకాల మాంసాలను కేవలం 10 శాతం మాత్రమే ఉడకబెట్టి తింటున్నారట.
అంటే మనం చికెన్‌ను చాలా సమయం ఉడికించి తింటాం కదా.కాని వారు మాత్రం కేవలం ఒకటి రెండు నిమిషాలు మాత్రమే ఉడికించి తింటారట.
ఇంకా చాలా రకాల వంటలు కూడా వారికి ఈ పరిస్థితిని తీసుకు వచ్చాయని అంటున్నారు.ఇన్నాళ్లు తాము తినేది ఆరోగ్యవంతమైన ఫుడ్ అని, తమకు రోగాలు తక్కువ వస్తాయని వారు అనుకునేవారు.కాని ఇప్పుడు వారు కరోనా వైరస్‌తో అసలుకే మోసం వచ్చింది.ఇన్నాళ్లు ఆరోగ్యంగా ఉన్నా ఇప్పుడు అంతా చచ్చే పరిస్థితి వచ్చింది.అందుకే ఇకపై అయినా చైనా వారు చెత్తను తినడం మానేస్తే బెటర్ అంటూ ప్రపంచ దేశాలు హితవు పలుకుతున్నాయి.