కొత్తిమీర పూదీనాను ఎందులో వాడతారు అంటే చిన్న పిల్లలతో సహా అందరు ఠక్కున చెప్పేది నాన్ వెజ్ వంటల్లో అని.చాలా మంది ఈ రెండింటిని కేవలం నాన్ వెజ్ వంటల్లో మాత్రమే వాడుతారు.
మరీ ముఖ్యంగా కొందరు పూదీనా వాడకుండా కొత్తిమీరను మాత్రమే కూడా నాన్ వెజ్ వంటల్లో వాడుతారు.పూదీనా వాసన కాస్త చూస్తే బాగుంటుంది.
కాని అది ఎక్కువ అయితే బాగుండదు అనేది చాలా మంది అభిప్రాయం.అందుకే పూదీనాను కొద్ది మంది పక్కకు పెడతారు.
కూరల్లో కొత్తిమీరను వాడుతారు.కాని పూదీనా పక్కకు పెట్టేది కాదు కేవలం కూరల్లో మాత్రమే కాకుండా డైరెక్ట్‌గా కూడా తీసుకుంటే చాలా మంచిది అంటూ స్వయంగా వైధ్యులు చెబుతున్నారు.
పూదీనాతో ఆరోగ్యంకు ఎంత మేలు అనేది ఇప్పుడు చూద్దాం.
కంటిన్యూగా దగ్గు వస్తూ ఉంటే పూదీన ఆకుల రసం మరియు బ్లాక్ సాల్డ్‌తో కలిపి తాగితే దగ్గు అనేది కొన్ని గంటల్లోనే తగ్గిపోతుంది.

కలరా గతంలో చాలా ఇబ్బంది పెట్టేది.కాని ఇప్పుడు చాలా తక్కువ.అయినా కూడా కలరా నుండి దూరంగా ఉండాలి అంటే పూదీన ఆకుల రసంను నిమ్మరసం మరియు తెనె కలుపుకుని తాగితే బాగుంటుంది.
పూదీన ఆకులను గుజ్జుగా చేసి ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించి గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
టైపాయిడ్ జ్వరంతో బాధపడేవారికి పూదీన ఆకులను మరియు తులసి ఆకులను కలిపి మిక్స్ చేసి దాని నుండి రసం తీసి దాన్ని తాపించడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

కొందరి నోరు ఫ్రెష్‌గా ఉండేందుకు చూయింగ్‌గమ్ తింటూ ఉంటారు.అది కాకుండా రెండు లేదా మూడు పూదీన ఆకులను నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే నోరంతా ఫ్రెష్‌గా అవుతుంది.
ప్రయానం చేసే సమయంలో వాంతులు అయినట్లుగా అనిపిస్తే పూదీన ఆకులను వాసున చూడటం నోట్లో ఉంచుకుని చప్పరించడం లాంటివి చేస్తే వాంతులు రావు.
ఇక చివరగా ఇంట్లో చెడు వాసన వస్తున్నట్లుయితే నాలుగు అయిదు పూదీన ఆకులను కొన్ని నీళ్లలో తీసుకుని ఆ నీటిని అయిదు నిమిషాల పాటు స్టౌవ్ పై పెట్టి మరగబెట్టడం ద్వారా ఇల్లు మొత్తం మంచి వాసన వ్యాపిస్తుంది.