శారీస్ టూ సూట్స్ క్యాలెండర్ 2020 ఎడిషన్‌లో 18 నుంచి 97 సంవత్సరాల వయసున్న ఇండో-అమెరికన్ మహిళలు సందడి చేశారు.2012లో దక్షిణాసియా ప్రముఖ మహిళల రోల్ మోడల్స్ నటించగా, దానిని ప్రారంభించిన భారతీయ-అమెరికన్, మాజీ సీఎన్ఎన్ యాంకర్ పత్తి త్రిపాఠి స్ఫూర్తిని ఈ కొత్త ఏడాది సైతం కొనసాగిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
దక్షిణాసియా మహిళలను శక్తివంతంగా చేసే సాధనంగా రూపొందించబడిన 36 పేజీల ఈ క్యాలెండర్‌లో బయోస్, సాధికారత కోట్స్‌ను ప్రచురించారు.దీనితో పాటు దక్షిణాసియాలోని అన్ని ప్రధాన మతాలకు సంబంధించిన సెలవులు, పండుగలు, మహిళలకు సంబంధించిన తేదీలను ప్రస్తావించారు.2020 క్యాలెండర్‌లో కనిపించిన మహిళలల్లో సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికేడ్ సర్వీసెస్ నిర్వాహకులు, న్యూజెర్సీలోని బోర్డ్ సర్టిఫికేట్ అనస్థీయాలజిస్ట్ నినా రాడ్‌క్లిఫ్, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ రాజ కుటుంబానికి చెందిన వారు, కాలిఫోర్నియాకు చెందిన బెనెర్లీ హిల్స్ మెడికల్ డైరెక్టర్ నైనా సచ్‌దేవ్ తదితరులు ఉన్నారు.
మహిళలు, బాలికల పురోగతిని అడ్డుకునే వాటిపై అవగాహన కల్పించడం, పలు స్వచ్చంద సంస్థలకు మద్ధతు ఇవ్వడంపై శారీస్ టూ సూట్స్ తాజా ఎడిషన్ దృష్టి పెడుతుందని త్రిపాఠి తెలిపారు.రక్ష, అప్నాఘర్, దక్షిణాసియా మహిళలకు, సఖి, ఆసియా బిజినెస్ నెట్‌వర్కింగ్, అస్సెండ్ అట్లాంటాతో సహా పలు యూఎస్ సంస్థలకు క్యాలెండర్ బాక్సులు విరాళంగా ఇవ్వబడతాయి.