టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.ఏపీ రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విజయవాడలో 24 గంటల రిలే నిరాహారదీక్ష ను చేపట్టారు.ఈ సందర్భంగా దీక్షా స్థలికి లోకేశ్ వెళ్లి సంఘీభావం ప్రకటించారు.
అనంతరం అక్కడ నుంచి బయలుదేరిన లోకేశ్ ను కనకదుర్గమ్మ వారధి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.లోకేశ్ తో పాటు అదే వాహనంలో ప్రయాణిస్తున్న టీడీపీ నేత, ఎమ్మెల్యే రామానాయుడును, మరో ఇద్దరు నేతలను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.
అయితే, వీరిని కలెక్టరేట్ మీదుగా తొట్లవల్లూరు వైపు తీసుకెళ్లారు.
మరోవైపు, టీడీపీ శ్రేణులు ఈ అంశంపై మాట్లాడుతూ, పార్టీ ఆఫీసుకు వెళ్తున్నానని లోకేశ్ పోలీసులకు చెబుతున్నప్పటికీ ఏమాత్రం వినిపించుకోకుండా అరెస్ట్ చేసినట్లు నేతలు మండిపడుతున్నారు.
మరోపక్క ఎంపీ గల్లా జయదేవ్ ను కూడా ఈ రోజు ఉదయం నుంచి హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు తాజాగా లోకేశ్ ను అరెస్ట్ చేయడం తో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది.