దేశంలో ఎప్పుడు ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి.మొన్నటి వరకు మహారాష్ట్ర రాజకీయం రసకందాయంగా సాగిన విషయం తెల్సిందే.
మళ్లీ ఇప్పుడు మరో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహించబోతున్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.
ప్రస్తుం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెల్సిందే.సొంతంగా ఆప్ పార్టీ అభ్యర్థి కేజ్రీ వాల్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
ఈసారి ఢిల్లీ ప్రజలు ఎవరికి ఛాన్స్ ఇస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు కూడా ఢిల్లీలో బలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.
అయితే ఈసారి అక్కడ ఎక్కువ శాతం హంగ్ వచ్చే అవకాశం ఉందని, ఈ మూడు పార్టీల్లో ఏ రెండు పార్టీలు అయినా కలిసి అధికారంను ఏర్పాటు చేయాల్సిందే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక డేట్ల విషయానికి వస్తే ఈనెల 14న నోటిఫికేషన్ విడుదల కానుంది, ఫిబ్రవరి 8న పోలింగ్, 11న లెక్కింపు.11 రాత్రి వరకు ముఖ్యమంత్రి ఎవరు అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.