పదునైన విమర్శలు చేయడంలోనే కాదు వినూత్న రీతిలో ఆలోచిస్తూ అందరి దృష్టి తనమీద పడేలా చేసుకోవడంలో నగరి వైసీపీ ఎమ్యెల్యే రోజాకు మరెవ్వరూ సాటిలేరనే చెప్పాలి.తాజాగా తన సొంత నియోజకవర్గమైన నగరిలో ఆమె ప్లాస్టిక్ పై వినూత్న రీతిలో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
నగరి అసెంబ్లీ పరిధిలో ఉన్న అన్ని మునిసిపల్ వార్డులు, పంచాయతీ గ్రామాల నుంచి ప్రమాదకర ప్లాస్టిక్‌ను తొలగించాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ మేరకు ఫేస్ బుక్ ద్వారా ఆమె కేజీ ప్లాస్టిక్ తీసుకొస్తే కిలో బియ్యం ఇస్తున్నట్టు బంపర్ ఆఫర్ ను ప్రకటించారు.
ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ కార్యక్రమం నవంబర్ 17 తన పుట్టినరోజు నుంచి ప్రారంభం అయ్యి సిఎం వైయస్ జగన్ పుట్టినరోజు (డిసెంబర్ 21) వరకు ‘ప్లాస్టిక్ లేని న్యూ నగరి’ అనే నినాదంతో కొనసాగుతుంది అంటూ ఆమె పేర్కొన్నారు.
మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం, అందరికీ ఆదర్శంగా నిలుద్దాం అంటూ ఆమె సూచించారు.