విడ్డూరం : పెళ్లి అయిన కొన్ని గంటల్లోనే విడాకుల వరకు వెళ్లారు.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు

పెళ్లి అయిన కొన్ని రోజుల్లోనే విడాకులు తీసుకోవడం, పెళ్లి అయిన వెంటనే భార్య భర్తల మద్య గొడవలు రావడం లేదంటే ఇరు కుటుంబాల మద్య గొడవలు రావడం అనేది చాలా కామన్‌గా చూస్తూనే ఉంటాం.అయితే పెళ్లి వేడుకలోనే గొడవలు రావడం మాత్రం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.

 Marriage Canceled Because Of Clothes In Jharkhand-TeluguStop.com

చాలా నెలల క్రితం పెళ్లిలో అబ్బాయి తరపు వారికి సరైన బోజనం పెట్టలేదని చెప్పి పెళ్లిని రద్దు చేసుకున్న సంఘటన మనం చూశాం.ఇంకా పెళ్లిలో తమకు అవమానం జరిగిందని గొడవ పడి ఆ తర్వాత విడాకులు వరకు వెళ్లిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా అచ్చు అలాంటి సంఘటనే జరిగింది.జార్ఖండ్‌ రాష్ట్రంలోని పిడారీ గ్రామంలో ఈ సంఘటన జరిగింది.గ్రామానికి చెందిన నౌషద్‌ అన్సారీ కూతురుకి కుర్షిద్‌ అన్సారీ కొడుకుకు పెళ్లి నిశ్చయం అయ్యింది.పెద్దలు మాట్లాడుకుని తేదీ నిర్ణయించి పెళ్లి జరిపారు.

పూర్తిగా వారి సాంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిగింది.అంతా అనుకున్నట్లుగా సాఫీగా జరిగి పోయిందని భావిస్తున్న తరుణంలో అబ్బాయి తరపు వారు అమ్మాయికి బట్టలు పెట్టాల్సి ఉంటుంది.

అక్కడే అసలు గొడవ మొదలైంది.

విడ్డూరం : పెళ్లి అయిన కొన్ని �

బట్టలు పెట్టే క్రమంలో అమ్మాయికి అబ్బాయి తరపు వారు పాత బట్టలు పెట్టారు.వాడేసిన బట్టలను తీసుకు వచ్చి కొత్త బట్టలుగా పెట్టేందుకు ప్రయత్నించారు.విషయం గమనించిన వధువు తన వారికి చెప్పింది.

దాంతో వారు అబ్బాయి తరపు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వారు కూడా గొడవకు దిగడంతో వధు వరులు ఇద్దరు కూడా గొడవకు దిగారు.

గొడవ తీవ్ర రూపం దాల్చింది.వధువు తనకు ఈ పెళ్లి వద్దు, క్యాన్సిల్‌ చేయాల్సిందే అంటూ పట్టుబట్టింది.

ఆమె కోరిక మేరకు పెళ్లి క్యాన్సిల్‌ చేసుకోవాలని తల్లిదండ్రులు భావించారు.పెళ్లి కోసం ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ అబ్బాయి తరపు వారిని కోరడం జరిగింది.అయితే వారు ఇచ్చేందుకు నిరాకరించడంతో అబ్బాయి తరపు బందువులందరిని కూడా బంధించారు.డబ్బులు ఇస్తేనే ఆ 150 మంది బందువులను వదిలి పెడతాం అంటూ అమ్మాయి తరపు బంధువులు తేల్చి చెప్పారు.

ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఏకంగా రాష్ట్ర స్థానిక మంత్రి రంగంలోకి దిగి గొడవకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాల్సి వచ్చింది.గొడవ అయితే సర్దుమనిగింది కాని వారిద్దరిని మాత్రం కలపలేక పోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube