రాష్ట్ర అసెంబ్లీ క్యాంటీన్‌లో చోటు చేసుకున్న దారుణం... మంత్రులకే మరీ ఇలాంటి పరిస్థితా?

సాదారణ హోటల్స్‌లో నీట్‌గా లేకుండా వండి వడ్డించడం జరుగుతుంది.ఆ విషయం అందరికి తెల్సిందే.

 Chicken Pieces Found In Vegetarian Food Served In Maharashtra Assembly-TeluguStop.com

ఏదో పెద్ద ప్రముఖ హోటల్స్‌ అయితే తప్పితే నీట్‌గా ఉంచరు.సాదారణ హోటల్స్‌లో అంతా గందరగోళంగా ఉంటుంది.

కిచెన్‌లో పరిస్థితి చూస్తే అసలు తినాలనిపించదు.అయితే ఇదంతా కూడా ఒక మామూలు హోటల్‌లో పరిస్థితి.

కాని అసెంబ్లీ క్యాంటీన్‌ అంటే ఎలా ఉండాలి.అక్కడ పరిస్థితి ఎలా ఉండాలి.

ప్రముఖ నాయకులు మరియు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.కాని అసెంబ్లీలో కూడా ఒక సాదా సీదా హోటల్‌ పరిస్థితి ఉంది.

మహారాష్ట్ర అసెంబ్లీ క్యాంటీన్‌లో దారుణం జరిగింది.అక్కడ క్యాంటీన్‌లో వెజ్‌ మరియు నాన్‌ వెజ్‌కు వేరు వేరు కౌంటర్లు ఉంటాయి.మహారాష్ట్రలో ఎక్కువ శాతం వెజిటేరియన్స్‌ ఉంటారు.అందుకే వారి కోసం వెజిటేరియన్‌ కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యేలు మరియు ఆఫీసర్లు వచ్చి అక్కడ టిఫిన్‌ బోజనం స్నాక్స్‌ తీసుకుంటూ ఉంటారు.అయితే తాజాగా వెజిటేరియన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ ఇస్తే నాన్‌ వెజ్‌ వచ్చింది.

రాష్ట్ర అసెంబ్లీ క్యాంటీన్‌ల

ఆర్డర్‌ మారిందని కాదు, వెజిటేరియన్‌ ఫుడ్‌లో నాన్‌ వెజ్‌ ఫుడ్‌ వచ్చింది.అంటే కిచెన్‌లో గందరగోళం ఏర్పడి నాన్‌వెజ్‌ ఫుడ్‌ మరియు వెజ్‌ ఫుడ్‌ ఒకే చోట వడటం వల్లో లేదా మరేంటో కాని కొన్ని నాన్‌వెజ్‌ ముక్కలు అంటే అవి చికెన్‌ లేదా మటన్‌ అయ్యి ఉండవచ్చు.ఆ ముక్కలు వెజ్‌ ఫుడ్‌లో పడ్డాయి.ఒక వ్యక్తి వెజ్‌ బిర్యానీ ఆర్డర్‌ ఇస్తే అందులో నాన్‌వెజ్‌ ముక్కలు వచ్చాయి.ఈ సంఘటన స్థానికంగా తీవ్ర దుమారంను రేపుతోంది.అసెంబ్లీ క్యాంటీన్‌లో చేసే వ్యక్తిని రద్దు చేసి వేరే వారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌ పెరుగుతోంది.

మొత్తానికి ఎమ్మెల్యేల స్థాయి వారికే ఇలాంటి పరిస్థితి ఉంటే మరి సాదారణ జనాల పరిస్థితి ఏంటో మీరే ఊహించుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube