నటీనటులకు ఎన్ని చిత్రాల్లో నటించినా బ్రేక్ ఇచ్చే చిత్రాలుగా కొన్నిటిని మాత్రమే చెప్పుకోవచ్చు.అలా నటి కీర్తి సురేష్ కెరీర్ లో ఎవ్వరూ మరువలేని చిత్రం మహానటి.
ఆ చిత్రంలో నిజంగా కీర్తి మహానటి సావిత్రి గారేనా అన్న రేంజ్ లో నటించింది.ఆ చిత్రంతో చాలా మంది కీర్తి కి మరింత ఫిదా అయ్యారు అంటే నమ్మరు.
ఆ చిత్రంలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది.సావిత్రి గారు మరింత బొద్దుగా తయారు అవ్వడం వల్ల అవకాశాలు రావడం లేదు అని వార్త విన్నప్పుడు ఆమె ఇంట్లో పనివాడు మాత్రం మీరు బొద్దుగా ఉన్నా బాగుంటారు అమ్మగారు అంటూ సమాధానం ఇస్తాడు.
నిజంగా టాలీవుడ్ లో కొంచం బొద్దుగా ఉన్నా అవకాశాలు బాగానే అందుకుంటారు హీరోయిన్స్.కానీ బాలీవుడ్ లో అలా కాదు ఎంత సన్నగా ఉంటె అంత క్రేజ్ అన్నమాట.
ఇలా సౌత్ స్టార్స్ అందరూ చాలా మంది కూడా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి సన్నగా వాలగరెబ్బాల్లా తయారయ్యారు.ఇప్పుడు ఆ కోవలోనే వస్తుంది మన మహానటి.
మొన్నటివరకు ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు సన్నగా నాజూగ్గా తయారైంది.

జిమ్ కి వెళ్లి కసరత్తులు చేసి ఈ అమ్మడు జీరో సైజ్ మైంటైన్ చేస్తుంది.దీనికి కారణం ఆమె కు ఇటీవల బాలీవుడ్ నుంచి ఆఫర్ రావడమే.ఇక ఏం చేస్తుంది మరి.? నాజూగ్గా కనిపించడానికి జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తుందట.దీనితో ఈ అమ్మడు ఎవరూ గుర్తుపట్టని విధంగా.
సన్నగా, పుల్లలాగా మారిపోయింది.తాజాగా ఒక ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసింది కీర్తీ సురేష్.
ఇప్పుడు ఇదికాస్తా తెగ వైరల్ అవుతోంది.ఏంటి ఈమె మహానటినా.? కీర్తీ సురేష్‌నా అని నెటిజన్లు సైతం ఆశ్చర్యం పోయే రేంజ్ లో ఆ ఫోటో ఉండడం విశేషం.అయినా ఎంతో మంది సౌత్ నుంచి వెళ్లి స్థిరంగా అక్కడ తమ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు మరి కీర్తి కూడా అక్కడ కీర్తి గడిస్తుందో లేదంటే వెనక్కి తిరిగి వచ్చేస్తుందో చూడాలి.