అమెరికాలో ఎన్నారైలకి కష్టాలు తప్పేలా లేవు..

అమెరికాలో వీసా విధానాలపై సమూల మార్పులు తీసుకురావాలని ట్రంప్ ముందు నుంచీ ఆదేశాలు ఇస్తూ ,వలసవాసులకి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే హెచ్ -1 బీ వీసా విషయంలో విధించిన నిభందనలు అందరి తెలిసినవే.

 American Nri Face In Strugle-TeluguStop.com

అయితే గతంలోనే హెచ్ -1 బీ వీసా దారుల భాగస్వాముల పని అనుమతి విషయంలో మరో అడుగు ముందుకు వేశారు ట్రంప్.

తాజాగా హెచ్‌-1బీ వీసా దారుల భాగస్వాములకి పని అనుమతిపై నిషేధం విధించే ప్రక్రియని వేగా వంతం చేశారు.

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హెచ్ -1బీ వీసా దారుల జీవిత భాగస్వాముల పని అనుమతులు తొలిగించే విషయంలో ఇటీవల నోటీసులు జారీ చేశారు.తాజాగా ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా వేగంగా జరుగుతున్నట్టుగా అమెరికా ప్రభుత్వం పేర్కొంది.

ఈ ప్రతిపాధనలకి గనుకా అనుమతులు లభిస్తే వాటిని ఫెడరల్‌ రిజిస్ట్రీలో ప్రచురిస్తారు.ఆ తరువాత కొత్త ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలు తెలిపేందుకు దాదాపు 30-60 రోజుల వరకు వీలు ఉంటుంది.

అయితే ఈ ప్రక్రియ జరగడానికి కనీసం ఏడాది సమయం అయిన పడుతుందని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు.

గతంలో అమెరికాలోని కంపెనీల్లో పనిచేసేందుకు హెచ్‌-4 డిపెండెంట్‌ వీసాల కింద వీలు కల్పిస్తూ 2015లో ఒబామా ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది.

ఇప్పుడు ట్రంప్ గనుకా కొత్త నిభందనలు అమలులోకి తెస్తే హెచ్‌-1బీ వీసాదారుల కుటుంబాలలో కేవలం ఒకరు మాత్రమే ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది.ఆర్ధికంగా వారు నష్టపోయే అవకాశం ఎక్కువ అంటున్నారు నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube