తెలంగాణాపై బీజేపీ కన్ను ! టీఆర్ఎస్ కు చెక్ పెట్టడం ఖాయమా ?

దేశవ్యాప్తంగా విజయకేతనం ఎగురవేసి మళ్ళీ అధికార పీఠం మీద కూర్చోబోతోంది భారతీయ జనతా పార్టీ.ఇప్పుడు వచ్చిన కిక్ తో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని చూస్తోంది.

 Bjp Focus On Telangana State-TeluguStop.com

అసలు తమకు సీట్లే దక్కవని భావించిన కొన్ని రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో సీట్లు దక్కించుకోవడం, అలాగే ఇప్పటివరకు బలంగా ఉన్న రాష్ట్రాల్లో మరింత బలపడడంతో రాబోయే ఎన్నికల నాటికి కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది.అసలు 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత దేశంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.

కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని చాలామంది ఎన్నికలకు ముందే భావించారు.కానీ ఎన్డీయేకు 343 సీట్లు వస్తాయని ఎవరూ అంచనా వేయలేకపోయారు.

బీజేపీ రాజకీయ పరిస్థితిఅంతంత మాత్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈసారి భారీగా పుంజుకుంది.

త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని, పనిలో పనిగా తెలంగాణలోనూ రాజకీయంగా మరింత బలపడాలని ప్లాన్లు వేస్తోంది.

గత కొంతకాలంగా కేంద్రంలో మోదీతో కేసీఆర్ సన్నిహితంగా ఉంటూ వచ్చారు.ఈ కారణంగానే బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు.అయితే కేసీఆర్ మాత్రం ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేస్తూ అన్ని ప్రాంతీయ పార్టీలా చుట్టూ తిరిగాడు.ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని కూడా ప్లాన్ చేసుకున్నాయి.

అయితే ఇప్పుడు వచ్చిన ఫలితాలతో అంతా సైలెంట్ అయిపోయారు.ఇక కేసీఆర్ విషయంలో మోదీ ఏ విధంగా స్పందిస్తాడు అనేది తేలాల్సి ఉంది.

-Telugu Political News

తెలంగాణ నుంచి బీజేపీ తరపున నలుగురు ఎంపీలు ఎన్నికవడంతో వారిలో ఎవరో ఒకరికి కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిథ్యం లభించడం దాదాపు ఖాయం.అయితే ఒకరికి కాకుండా తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కితే మాత్రం బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టు భావించాల్సి ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.ఈ చర్చే ఇప్పుడు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లో కలవరం పుట్టిస్తోంది.ఫలితాలకు ముందు 16 ఎంపీ సీట్లు క్లిన్ స్వీప్ చేస్తామని చెప్పుకున్న టీఆర్ఎస్ కు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అందులో భాగం పంచుకోవడంతో రాజకీయంగా వెనుకబడ్డాం అనే భావన కలుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube