ఎన్నికల ముందు పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ప్రోత్సహించి ప్రత్యర్థి పార్టీలకు ఝలక్ ఇద్దామని చూస్తున్న టీడీపీకి ఇప్పుడు షాక్ లమీద షాక్ లు తగులుతున్నాయి.పక్క పార్టీల నుంచి నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుందామనే కంగారులో ఉన్న బాబు కి మారిన రాజకీయ పరిస్థితులు… అనేక సర్వే రిజల్ట్స్ గుబులు పుట్టిస్తున్నాయి.పెన్షన్ ల పెంపు… డ్వాక్రా మహిళలకు చెక్కులు… ఇలా ఒక్కో ప్రజాకర్షక పధకం ప్రవేశపెడుతున్న బాబు తమ గాలి పెరిగిందని…
ఇక తమకు తిరుగులేదని భావిస్తూ… వస్తున్నాడు.అయితే ఇదే సమయంలో….పెద్ద ఎత్తున చేరికలు కూడా ఉంటాయని భావించాడు.కానీ పార్టీలో చేరడం దాదాపు ఖాయం అయిపోయిన నాయకులు కూడా… ఇప్పుడు వెనకడుగు వేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికే కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరిపోవడం మింగుడుపడకముందే… ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కూడా వైసీపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసేసుకున్నారు.
ఆయన పార్టీ మారకుండా… శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.అందుకే పార్టీ సీనియర్ నాయకులతో ఆయన కు రాయబారాలు పంపుతున్నాడు.అయినా మనషి మాత్రం పెద్దగా స్పందించడంలేదు.
అలాగే మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేసినా కూడా ఆమంచి మాత్రం పెద్దగా పట్టించుకోవడంలేదట.దీంతో ఆయన్ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలి అనే విషయంలో క్లారిటీ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుండగానే… ఇప్పడు కర్నూల్ జిల్లా కీలక నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వ్యవహారం కూడా టీడీపీకి తలనొప్పులు తెలుస్తోంది.
బాబు ఆహ్వానం మేరకు భార్య – కొడుకు – తమ్ముడితో కలిసి ఉండవల్లికి వచ్చి బాబుతో భోజనం కూడా చేసి వెళ్లిన కోట్ల తొందర్లోనే టీడీపీలో చేరతారని వార్తలు వచ్చాయి.అయితే ఆయన కూడా టీడీపీలో చేరడం ఖాయమే అన్నట్టు నడుచుకున్నారు.
కానీ ఇంతలో ఏమైందో ఏమో కానీ… తాను అసలు టీడీపీలో చేరుతున్నా అని ఎప్పుడు చెప్పాను అంటూ… కొత్త పల్లవి అందుకున్నారు.
అంతే కాదు… తనకు ఒక్క టీడీపీ నుంచి మాత్రమే ఆహ్వానాలు అందలేదని… మిగతా పార్టీల నుంచి కూడా ఆహ్వానాలు ఉన్నాయని… తాను ఇంకా ఏ పార్టీలో చేరేది తేల్చుకోలేదు అంటూ వివరణ ఇచ్చారు.తనకు వైసీపీ నుంచి కూడా ఆహ్వానం ఉందని … ఇప్పటి వరకు తాను ఏ పార్టీలో చేరతానో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పేశారు.ప్రస్తుతం కోట్ల చేసిన ఈ వ్యాఖ్యలు చంద్రబాబు కి మింగుడుపడడంలేదు.
ఎందుకంటే కోట్ల చేరిక దాదాపు ఖాయం అనుకునే చంద్రబాబు మిగతా నాయకులకు ఆ విషయంలో ఇప్పటికే సర్ది చెప్పాడు.కోట్ల చేరిక ఖాయం అనుకుని ఇప్పటికే… డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కొంచెం అలక బూనారు.
ఆయన్ను బుజ్జగించి ఒప్పించిన బాబు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కోరిన కోర్కెలు తీర్చలేక కొన్నిటికి నో చెప్పాడట.
ఇంతకీ ఆయన కోరిన కోర్కెలు ఏంటి అంటే… తనకు కర్నూలు పార్లమెంటు సీటుతో పాటుగా తన సతీమణి కోట్ల సుజాతమ్మకు డోన్ అసెంబ్లీ సీటు కుమారుడు రాఘవేంద్ర రెడ్డికి ఆలూరు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని డిమాండ్ పెట్టారట.
అయితే డోన్ సీటుపై ఇప్పటికే కేఈ ప్రభాకర్ ఆశలు పెట్టుకుని ఉన్నారు.ఇక ఆలూరు సీటు విషయంలో అదే పరిస్థితి.
ఈ నేపథ్యంలో కర్నూల్ పార్లమెంట్ వరకు హామీ ఇవ్వడంతో కోట్ల అలక వహించే … ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.