ఏదైనా ఒక వస్తువు పోయిందంటే దొరకడం కష్టం.పోయి నెల రోజులు దాటింది అంటే దాన్ని వెదకడం కూడా మానేస్తాం.ఎందుకంటే నెల రోజులైన వస్తువు దొరకలేదంటే ఇక దొరకదని తేలిపోయినట్లే.99 శాతం నెల దాటిన తర్వాత వస్తువులు దొరకవు.అందుకే నెలలు గడిచిన తర్వాత పోయిన వస్తువుల గురించి వెదకండా సమయం వృదా.చేతి వేలికి పెట్టుకునే ఉంగరం పోయిందంటే ఇంట్లో పోతే ఏమో కాని బయట పోతే మాత్రం రెండవ రోజు కూడా దొరకడం అసాధ్యం.
కాని ఒక అమ్మాయి తన ఉంగరాన్ని పోగొట్టుకుని ఏకంగా 12 ఏళ్ల తర్వాత దక్కించుకుంది.చిన్నప్పుడు పోయిన ఉంగరం పెద్దయిన తర్వాత దొరకడంతో ఆమె ఆనందానికి అవదులు లేవు.
అయితే ఈ 12 ఏళ్లు ఆ ఉంగరం మరెక్కడో లేదు, ఆమె ముక్కులోనే ఉంది.
ఈ వింత సంఘటన బ్రిటల్లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… బ్యూటీషన్ అయిన అబిగైల్ థాంప్సన్‌కు కొన్ని రోజులుగా ముక్కు నొప్పిగా అనిపిస్తూ వస్తోందట.అయితే ఆమె లైట్ తీసుకుంది.
తాజాగా ఆమె ముక్కును టిష్యూ పేపర్‌తో క్లీన్ చేసుకుంటున్న సమయంలో ముక్కు నుండి ఉంగరం పడిందట.దాంతో షాక్ అయిన ఆమె విషయాన్ని తన తల్లికి చెప్పింది.
ఆ తల్లి చిన్నప్పటి విషయాన్ని అబిగైల్‌కు చెప్పడంతో ఆ ఉంగరం తనదే అని ఆమెకు గుర్తుకు వచ్చింది.

2007వ సంవత్సరంలో అబిగైల్‌కు 8వ పుట్టిన రోజు సందర్బంగా ఆమె తల్లి ఒక ఉంగరాన్ని బహుమానంగా ఇచ్చింది.ఆ ఉంగరంను అబిగైల్ పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో ఒక రాత్రి సమయంలో ఉంగరం ముక్కులోకి వెళ్లి పోయి ఉంటుంది.నిద్రించే సమయంలో అబిగైల్‌కు ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉండేదట.
దాంతో ఆ అలవాటు కారణంగానే ముక్కులోకి ఉంగరం పోయి ఉంటుందని తల్లి అభిప్రాయ పడింది.

చిన్నప్పుడు అబిగైల్ ఎక్కడో ఉంగరం పోగొట్టుకుని ఉంటుందని తాను భావించాను.ముక్కులోకి ఉంగరం పోయి ఉంటుందని తాను అనుకోలేదని తల్లి చెప్పుకొచ్చింది.అబిగైల్ మాత్రం తనకు ఇన్నాళ్లు ముక్కులో ఉంగరం ఉన్నా ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
ముక్కులో ఏదో ఉన్నట్లుగా కూడా అనిపించలేదు.మరి ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది.
మొత్తానికి 12 ఏళ్ల తర్వాత ముక్కులోంచి ఉంగరం బయటకు రావడంతో అబిగైల్ ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.