యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది.స్టార్ మాటీవీలో ప్రసారం అవుతున్న ఈ షో కు సుమ యాంకర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.
ఇప్పటి వరకు సుమ, ప్రదీప్ లు ఎన్నో షోలు చేశారు, ఎన్నో కార్యక్రమాలకు హోస్ట్‌లుగా వ్యవహరించారు.కాని పెళ్లి చూపులు వారి కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ షో అంటూ ఇద్దరికి పెద్ద చెడ్డ పేరు వచ్చింది.
తెలుగులో పెళ్లి చూపులు షోకు అంతగా ఆధరణ దక్కదు అంటూ మొదటి నుండి అంతా అంటూ ఉన్నారు.కాని షో పై చాలా నమ్మకం పెట్టుకున్న స్టార్ మా వారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

ఈ పెళ్లి చూపులు ఫైనల్ ఎపిసోడ్ వరకు వచ్చే అమ్మాయిలో ఒక అమ్మాయిని ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడు అంటూ అంతా అనుకున్నారు.అది జరగడం అసాధ్యం అని తేలిపోయింది.పెళ్లి చూపులు పేరుతో అమ్మాయిలను అత్యంత హింస పెట్టడం, వారి మనోభావాలతో ఆడుకోవడం, వారి మద్య చిచ్చులు పెట్టడం వంటివి చేస్తున్న కారణంగా వెంటనే ఈ షో ఆపేయాలని మహిళ సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు.షో మొదటి రోజే ఇదో ఫ్లాప్ షో అని తేలిపోయింది.
కాని స్టార్ మా టీవీ ముందే ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారం కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.

స్టార్ మాటీవీలో ప్రసారం అవుతున్న ఈ షోను తాజాగా ఆపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన ఈ షో స్టార్ మాకు భారీ నష్టాలను కూడా మిగిల్చింది.బిగ్ బాస్ సీజన్ 2 తర్వాత ప్రారంభం అయిన షో అవ్వడం వల్ల అంచనాలు భారీగా పెట్టుకున్నారు.
కాని అంచనాలను ఏమాత్రం రీచ్ కాలేక పోయింది.మరో వారం రోజుల్లో ఈ షోను నిలిపేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.