తెలుగు ప్రేక్షకులకు ‘దేశముదురు’ బ్యూటీగా పరిచయం అయిన హన్సిక మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్‌ను దక్కించుకుంది.భారీ స్థాయిలో అంచనాలున్న ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించి సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంది.
తెలుగుతో పాటు తమిళంలో కూడా హన్సిక వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది.కెరీర్ ఆరంభంలో చాలా బొద్దుగా కనిపించిన హన్సిక, సినిమాల్లో ఆఫర్స్ తగ్గుతున్న క్రమంలో సన్నబడి రీ ఎంట్రీ ఇచ్చింది.
సన్నబడి తన అందాన్ని పెంచుకోవడంతో ఈ అమ్మడికి ఒక్కసారి మళ్లీ ఆఫర్లు వెళ్లువెత్తాయి.అలాంటి సమయంలోనే తమిళ హీరో శింబుతో ప్రేమలో పడటం జరిగింది.
శింబు నుండి కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిన ఈ అమ్మడు ఆ తర్వాత పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది.ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా తమిళంలో ఈమె స్టార్ హీరోలతో వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోవడంతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తూ తమిళంలో గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న హన్సిక తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం వరుసగా గ్లామర్ పాత్రలు చేసిన ముద్దుగుమ్మ ఇకపై గ్లామర్ షోకు నో చెప్పబోతుంది.
కేవలం నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించింది.
తాను ఇకపై చేయబోతున్న సినిమాల విషయంలో కఠినంగా ఉండబోతున్నాను.
నా వయస్సు 27 సంవత్సరాలు, త్వరలో పెళ్లి చేసుకుంటాను.పెళ్లి వయస్సు వచ్చిన కారణంగా ఇకపై గ్లామర్ గా నటించడం మంచిది కాదని నేను భావిస్తున్నాను.
అందుకే ఇకపై స్కిన్ షోకు నో చెప్పడంతో పాటు, కేవలం నటనకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలను మాత్రమే చేయాలని నిర్ణయించుకుంది.వాటితో పాటు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలను కూడా చేసేందుకు ఓకే చెప్పాలని నిర్ణయించుకుంది.
సీనియర్ హీరోయిన్స్ అంతా కూడా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల దారిలో పడుతున్నారు.ఇప్పుడు హన్సిక కూడా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలను చేయాలని భావిస్తోంది.పెళ్లి విషయంలో పూర్తి నిర్ణయంను తన తల్లిదండ్రులకు వదిలేస్తున్నట్లుగా హన్సిక చెప్పుకొచ్చింది.స్కిన్ షోకు నో చెప్పడం వల్ల హన్సిక ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.