బాలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ తనూశ్రీ దత్త.ఈ అమ్మడు గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.
ఇప్పుడు ఉన్నట్లుండి ఏమైందో ఏమో కాని కొన్ని రోజులుగా బాలీవుడ్ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేస్తూ అందరికి షాక్ ఇస్తుంది.తాజాగా నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడు, లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు అంటూ ఆరోపించిన తనూశ్రీదత్తా బాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యింది.
తనూశ్రీ తనపై చేసిన వ్యాఖ్యలకు మనస్థాపంకు గురైన నానా పటేకర్ లీగల్‌గా ఆమెను ఎదుర్కొబోతున్నట్లుగా ప్రకటించాడు.
ఇప్పటికే ఆమెకు లీగల్ నోటీసులు పంపించినట్లుగా సమాచారం అందుతుంది.తన పరువు తీసేలా వ్యాఖ్యలు చేసినందుకు సమాధానం చెప్పాల్సిందే అంటూ తనూశ్రీకి నోటీసులు పంపించడం జరిగింది.ఆ నోటీసులు అందుకున్నా కూడా తనూ శ్రీ దత్తా మాత్రం తన మాటల యుద్దం కొనసాగిస్తుంది.
తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసి బాలీవుడ్‌లో దుమారం రేపింది.తన మొదటి సినిమా చాక్లెట్.ఆ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
కొత్త వారు అంటే ఇండస్ట్రీలో చులకన భావం ఉంది.అందుకే నా మొదటి సినిమా చాక్లెట్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.ఆయన ఒకానొక సీన్‌లో పూర్తిగా బట్టు విప్పి మరీ డాన్స్ వేయమన్నాడు.
ఆ సమయంలో నేను ఏం చేయాలో పాలు పోలేదు.అప్పుడే షూటింగ్ స్పాట్‌లో ఉన్న ఇర్ఫాన్ ఖాన్ ఆ ప్రయత్నంను విరమింపజేసి వివేక్‌ను అడ్డుకున్నాడు అంటూ తనూశ్రీ దత్తా గుర్తు చేసుకుంది.
ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు మీడియా ముందుకు తీసుకు రావడం వల్ల ఈమె పబ్లిసిటీ కోరుకుంటుందని, దాంతో పాటు ఈమె బ్లాక్ మెయిలింగ్‌కు కూడా పాల్పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.బాలీవుడ్‌లో కొందరు తనూశ్రీకి మద్దతు పలుకుతుండగా, మరి కొందరు మాత్రం ఆమెపై విమర్శలు చేస్తున్నారు.