ఏపీ అధికార పార్టీ టీడీపీ మీద ప్రజల్లో ఉండే వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తోంది.అందుకే ప్రజల్లో తమ పార్టీకి సానుభూతి వచ్చేలా .
అదే సమయంలో టీడీపీ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా సరికొత్త కార్యక్రమానికి ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది.అందుకే వినూత్నంగా ” నిన్ను నమ్మం బాబూ ” అనే పేరుతో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ అవినీతిని ప్రజలకు తెలియజేయాలని వైసీపీ చూస్తోంది.
ఈ కార్యక్రమాన్ని మూడు నెలల వరకు చేపట్టాలని వైసీపీ ప్రణాళిక రూపొందించింది.
గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే వాటిల్లో ఐదారు కూడా సరిగా అమలు కాలేదు.కీలకమైన రుణమాఫీ హామీని చంద్రబాబు నాయుడు పూర్తిగా చేయలేకపోయాడు.
అది కప్పి పుచ్చుకోవడానికి ఆ పథకం వర్తించకుండా సగం మంది రైతులను అనర్హులుగా చేసేసి.మిగతా వారికి అరకొరగా ఇచ్చారని ఇక డ్వాక్రా రుణాల రద్దు అనే కార్యక్రమం అంతా బూటకం అని దాని ద్వారా ఎవరూ లబ్ది పొందలేదని వైసీపీ వాదిస్తోంది.
కేవలం మాఫీ హామీకే కాకుండా కులాల వారీగా ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నాయుడు అమలు చేయలేదు.కాపులకు బీసీల హోదా కల్పన, బోయలను ఎస్టీల్లోకి చేర్చడం వంటి హామీలను కూడా ఇచ్చాడు అయితే అవేవీ అమలు కాలేదు.
ఇలా చెబుతూ పోతే చంద్రబాబు హామీలు అన్ని ఉత్తుత్తి హామీలుగానే మిగిలిపోయాయని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.ఇటువంటి విషయాలను గురించి ప్రజలకు వివరిస్తూ … వారిలో చైతన్యం నింపి ప్రజకు చంద్రబాబు చేసింది శున్యం అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ ప్లాన్.
వచ్చే నెల మొదటి వారం నుంచి నిరంతరంగా ప్రజల్లో తిరగాలని ఆ పార్టీ భావిస్తోంది.