వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణలో సత్తా చాటుకోవాలనే ఉద్దేశంతో అక్కడ పార్టీని స్థాపించారు.రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలను సైతం నిర్వహించారు.
తమ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, ముఖ్యంగా తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం అంతా తమ పార్టీలో చేరుతారని ఆశలు పెట్టుకున్నారు .అయితే అక్కడ చేరికలు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినా, ఎక్కడా గెలిచే పరిస్థితి లేకపోవడం తదితర కారణాలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు.అంతేకాకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా, కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నించినా, తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) సీనియర్ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ విలీన ప్రక్రియ కు బ్రేకులు పడ్డాయి.అయినా షర్మిల( Sharmila ) కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.

అయినా కాంగ్రెస్ నుంచి స్పందన అంతంత మాత్రమే అన్నట్టుగా వచ్చింది.ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఒత్తిడి పెంచినా, ఆమె మాత్రం తాము తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని ప్రకటించడం వంటివి కూడా కాంగ్రెస్ లో వైస్సార్ తెలంగాణ పార్టీ విలీన ప్రక్రియ నిలిచిపోవడానికి కారణం అయ్యాయి.ఇదిలా ఉంటే ఏపీలో కాంగ్రెస్ కు ఊపు తీసుకువచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.దీనిలో భాగంగానే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు షర్మిల కు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.
ఈ కార్యక్రమంలో షర్మిల( YS Sharmila ) మరోసారి చేతులు కాల్చుకునేందుకు సిద్ధమవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.

పేరుకు పార్టీ ఉన్నా.క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలం లేదు.ఇప్పటికే ఏపీ కాంగ్రెస్( AP congress ) కు చెందిన నాయకులు, కార్యకర్తలు చాలామంది ఇతర పార్టీలలో చేరిపోయారు.ఆ ప్రభావం ఏపీ కాంగ్రెస్ లో పెద్దగా కనిపించే అవకాశం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దీనికి కారణం షర్మిల తెలంగాణ వాదం ఎత్తుకోవడం, తాను తెలంగాణ బిడ్డనని షర్మిల గతంలో వ్యాఖ్యానించడం ఇవన్నీ షర్మిలకు స్పీడ్ బ్రేకర్లు గానే మారే అవకాశం కల్పిస్తుంది.