మెగా మీరో సాయి ధరమ్ తేజ్ రెండు సంవత్సరాలుగా చేసిన ఏ ఒక్క సినిమా కలిసి రావడం లేదు.ఇప్పటి వరకు వరుసగా అరడజను చిత్రాలు బాక్సాఫీస్ ముందు బొక్క బోర్లా పడ్డాయి.
వరుసగా చేస్తున్న సినిమాలు అన్ని కూడా ఫ్లాప్ అవుతుండటంతో సాయి ధరమ్ తేజ్ బాగా ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపిస్తున్నాడు.కథ, కథనం బాగాలేకున్నా కూడా ఎలా సినిమాలకు కమిట్ అవుతున్నాడో అర్థం కావడం లేదు.
ఈయన చేసిన, చేస్తున్న సినిమాలు ఏ ఒక్కటి కూడా మంచి స్టోరీ లైన్‌తో రావడం లేదనేది విమర్శ.గతంలో తేజూ సక్సెస్‌లు దక్కించుకున్న చిత్రాల్లో తన మామయ్య పాటలను రీమిక్స్ చేశాడు.
గతంలో మాదిరిగా ఏదో ఒక మ్యాజిక్ వర్కౌట్ అయ్యేలా తన మామయ్య పాటను అయిన రీమిక్స్ చేస్తే బాగుంటుందని కొందరు సలహా ఇస్తున్నారు.అయితే తాజాగా తేజూ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు.ఇప్పటి వరకు తన మామయ్య పాటలను రీమిక్స్ చేసి సక్సెస్‌లు సాధించాను.అయితే ఇకపై తన మామకు సంబంధించిన ఏ ఒక్క పాటను తన సినిమాలో రీమిక్స్ చేయాలని కోరుకోవడం లేదు.
ఒక వేళ దర్శకుడు లేదా నిర్మాత ఆ విషయమై తనపై ఒత్తిడి చేసినా కూడా తాను అందుకు అంగీకరించేది లేదు అంటూ తేల్చి చెప్పాడు.సాయి ధరమ్ తేజ్ ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏమై ఉంటుందా అని ప్రస్తుతం అంతా చర్చించుకుంటున్నారు.
సాయి ధరమ్ తేజ్ గతంలో తన సినిమాల్లో ఎక్కువగా చిన్నమామ లేదా పెద్ద మామను ఇమిటేట్ చేసేవాడు.కాని ఇప్పుడు మాత్రం తన స్టైల్లోనే సినిమాలు చేయాలని భావిస్తున్నాడు.
అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.ఆ కారణాల వల్ల కూడా ఈయన చిత్రాలు ఫ్లాప్ అవుతున్నాయేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వరుసగా తేజూ తీసుకుంటున్న ఈ సంచలన నిర్ణయాలు ఆయన కెరీర్‌పై ప్రభావితం అవుతాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా స్టార్డం రాకుండానే తన మామయ్యల ఇమేజ్ నుండి బయటకు వచ్చేందుకు తేజూ ప్రయత్నించడం ఏమాత్రం సమంజసం కాదని, ఇప్పటికి అయినా మామయ్యల అడుగు జాడల్లో నటిచేందుకు ప్రయత్నించాల్సిందిగా సినీ వర్గాల వారు సలహా ఇస్తున్నారు.
తేజూ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు.ఆ రెండు చిత్రాలు అయినా సక్సెస్ అవుతాయో లేదో చూడాలి.ఆ సినిమాలు కూడా ఫ్లాప్ అయితే తేజూ కెరీర్ మరింత కష్టాల్లో పడే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.