దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో ఢీ.ఇప్పటికి తొమ్మిది సీజన్స్ దిగ్విజయంగా ముగించుకుని పదవ సీజన్ రన్ అవుతుంది.
మొదటి సీజన్ నుండి కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సాగుతుంది ఈ అల్టిమేట్ డ్యాన్స్ షో.ఇప్పటివరకూ తెలుగు టీవీ చరిత్రలో ,సౌతిండియా టీవి చరిత్రలో ఇలాంటి ప్రొగ్రాం రాలేదనడంలో అతిశయోక్తి లేదు.ఇప్పటివరకూ ఎందరో డ్యాన్సర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.
ఒక్కొక్కరి ఫెర్మార్మన్స్ చూస్తుంటే వీళ్ల ఒంట్లో ఎముకలున్నాయా అసలు అనిపిస్తుంది.కొన్ని సార్లు ఒళ్లు గగుర్పొడిచేంత భయంకరమైన స్టెప్స్ కూడా వేస్తుంటారు డ్యాన్సర్స్.అవన్నీ బుల్లి తెర ప్రేక్షకులకు చాలా దగ్గరనుండి చూపించిన షో ఢీ.ఒక జబర్దస్త్ ఎందరో కమెడియన్స్ ని ఇండస్ట్రీకి ఇస్తే ,ఢీ కూడా ఎందరికో దారి చూపించింది.భానుమతి అలియాస్ సాయి పల్లవి ఈ షో ద్వారానే ముందు పేరు తెచ్చుకుంది.
ఈ షోలో జూనియర్స్ కేటగిరీ లో పార్టిసిపేట్ చేసిన చిన్నారి వర్షిణి గుర్తుందా.ఇప్పుడెలా ఉందో తెలుసా….
ఢీ మొదటి సీజన్ నుండి కూడా ఆరు సీజన్ల వరకూ ఉదయభాను హోస్ట్ చేసింది.తర్వాత రెండు సీజన్లు కొణిదెల నిహారిక,తర్వాత ప్రదీప్ మాచిరాజు ఒక సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించి,ఇప్పుడొస్తున్న పదో సీజన్ గా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.
ఢీ సీజన్స్ లో ఇప్పటి వరకూ లేడీస్ స్పెషల్,జూనియర్స్,జోడీ స్పెషల్ ఇలా ఎన్నో రకాల మారుతూ పదవ సీజన్లోకి వచ్చింది.హోస్ట్ లు మారిన ,ప్రోగ్రాం ఒక్కో సీజన్ లో ఒక్కొ స్పెషల్ క్వాలిటితో ముందుకొచ్చినా ప్రేక్షకుల అభిమానంలో తేడాలేదు.
ఇప్పటివరకూ తొమ్మిది సీజన్ల ద్వారా తొమ్మిది మంది విజేతలయ్యారు.
వారిలో వర్షిణి ఒకరు.ఢీ జూనియర్స్ గా వచ్చిన సెవెన్త్ సీజన్లో తన పెర్మార్మెన్స్ తో అదరగొట్టి విన్నర్ అయింది.అప్పుడు చిన్న పిల్లలా ఉన్నా వర్షిణి ఇప్పుడు హీరోయిన్లా మారింది.
మేని ఛాయ నలుపు అయినప్పటికీ కళ కలిగిన ముఖంతో ప్రేక్షకులను ఆ వర్షిణి,ఈ వర్షిణి ఒకరేనా అనేలా చేస్తుంది.కావాలంటే మీరూ చూడండి.