అవకాశం దొరికితే చాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై నిప్పులు చెరుగుతూ విరుచుకుపడే బ్యాచ్ తెలుగుదేశంలో చాలామందే ఉన్నారు.వారిలో ముక్కుసూటిగా మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసే వ్యక్తి మాత్రం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి మాత్రమే.
వారిద్దరికీ ఏ విషయంలో చెందిందో తెలియదు కానీ జగన్ ప్రస్తావన వస్తే చాలు జేసీ ఉగ్రరూపం దాల్చేస్తుంటాడు.నిన్న మహానాడులో కూడా జగన్ నే టార్గెట్ చేసుకున్నారు జేసీ.
జగన్ ఒక అహంకారి అని, ఎవరి మాట వినరనీ, అన్నీ ఆయనకు తాతబుద్ధులే వచ్చాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
గతంలో తనను వైసీపీలో చేరమని బతిమిలాడుకున్నారని దానికి రాయబారిగా ఇప్పటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన వద్దకు వచ్చారని చెప్పారు.వచ్చిన వ్యక్తి తనను పార్టీలో చేరామనకుండా మీరు ఎంత డబ్బు ఖర్చుపెట్టగలరని నన్ను ప్రశ్నించడంతో నాకు మండి నేను మీ పార్టీలో చేరనని చెప్పేసానన్నారు.జగన్ ఎప్పుడూ డబ్బు లెక్కలే వేసుకుంటాడని అలంటి పార్టీ చేరితే విలువ ఉండదని జేసీ చెప్పుకొచ్చారు.
మహానాడు లో జేసీ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది.గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరతామంటూ ఎంతో మంది తమ అధినేత జగన్ ను సంప్రదించారని, అందులో జేసీ దివాకర్ రెడ్డి ఒకరని చెబుతున్నారు.
జేసీ దివాకర్ రెడ్డి రెండు స్థానాలు అడిగినందున, జగన్ కుదరదన్నారని అందుకే ఆయన టీడీపీలోకి వెళ్లారని వైసీపీ నేతలు చెప్తున్నారు.ఆ సమయంలో డబ్బుల ప్రస్తావనే రాలేదని జేసీ అన్నీ అబద్ధాలు చెబుతున్నారంటున్నారు.
జేసీకి ముందు నుంచి భజన చేయడం అలవాటేనని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
రాబోయే ఎన్నికల్లో తిరిగి రెండు టిక్కెట్లు సాధించుకునేందుకే జేసీ జగన్ పై లేని పోని ఆరోపణలు చేశారంటున్నారు.
జగన్ పై అనవసర ఆరోపణలు చేయడం జేసీకి తొలి నుంచి అలవాటేనన్నారు.ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదన్నారు.
ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పార్టీలో పట్టు పెంచుకునేందుకే జగన్ ను జేసీ తిడుతున్నారన్నారు.జగన్ ను తిడితే చాలు చంద్రబాబు వారికి ఏదైనా చేస్తారన్న నమ్మకంతోనే జేసీ జగన్ పై నోరుపారేసుకున్నారని వైసీపీ నేతలు విమర్శించారు.
ఎప్పటికైనా జేసీ చంద్రబాబుకు తలనొప్పిగా మారతారని కూడా వారు జోస్యం చెబుతున్నారు.ఇవన్నీ పక్కనపెడితే జేసీకి జగన్ మీద ఎందుకు అంత కసి ఉంది .? దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.