జోక్‌ : ‘నేలటిక్కెట్టు’కు హౌస్‌ఫుల్‌

రవితేజ, మాళవిక శర్మ జంటగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేలటిక్కెట్టు’.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Nela Ticket Housefull Director Kalyan Krishna-TeluguStop.com

ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు మొదటి ఆటకే నెగటివ్‌ టాక్‌ వచ్చింది.బ్యాడ్‌ రివ్యూస్‌ మరియు నెగటివ్‌ టాక్‌తో సినిమా కలెక్షన్స్‌ రెండవ షో నుండే పడిపోయాయి.

మొదటి రోజు కాస్త పర్వాలేదు అన్నట్లుగా వచ్చినా రెండవ రోజు నుండి మినిమం కలెక్షన్స్‌ కూడా రాలేదు.శని, ఆదివారాలు కూడా సినిమాకు ఆశాజనకంగా కలెక్షన్స్‌ను రాబట్టలేక పోయింది.

‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న కళ్యాణ్‌ కృష్ణ తాజాగా ఈ చిత్రంతో మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు.కథ, కథనం అన్ని కూడా కూడా మూస పద్దతిలో ఉన్నాయని, ఏమాత్రం ఆకట్టుకోని కథనంతో సినిమాను తెరకెక్కించాడు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.రవితేజ వంటి మాస్‌ హీరోను చూపించడంలో కళ్యాణ్‌ కృష్ణ విఫలం అయ్యాడు.అలాగే రవితేజ బాడీలాంగ్వేజ్‌ పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లుగా క్లీయర్‌గా అనిపిస్తుంది.

ఇవన్ని కలిసి సినిమా ఒక ఫ్లాప్‌ సినిమాగా మిగిలి పోయింది.

సినిమాకు ఫ్లాప్‌ టాక్‌ రావడం, థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లక పోవడం అంతా చూస్తూనే ఉన్నారు.

కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం నేలటిక్కెట్టును ఇంకా ప్రమోట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు నెత్తిన గుడ్డ వేసుకున్నారు.

అయినా కూడా వారితో చిన్నపాటి వీడియో తీయించి ప్రమోషన్‌ చేస్తున్నారు.రివ్యూలు బ్యాడ్‌గా వచ్చిన ప్రేక్షకులు భారీగా తరలి వస్తున్నారని, సినిమాకు మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయంటూ థియేటర్ల వద్ద డిస్ట్రిబ్యూటర్లతో చెప్పించారు.

ఆ వీడియోను దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ షేర్‌ చేశాడు.‘నేలటిక్కెట్టు’ చిత్రం ఇప్పటికే ఫ్లాప్‌ టాక్‌ను తెచ్చుకుంది.ఆ సినిమా ఇంకా బాగుందని చెబితే నమ్మేందుకు ప్రేక్షకులు అమాయకులు కాదు.రివ్యూల్లో సినిమాను బ్యాడ్‌గా చూపించారు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

అయితే సినిమా బాగుంటే రివ్యూలు బ్యాడ్‌గా ఉండవని, ఒక వేళ బ్యాడ్‌ రివ్యూలు వచ్చినా కూడా ప్రేక్షకులు సినిమా బాగుంటే ఆగరు అనే విషయాన్ని వారు తెలుసుకోవాలి.సినిమా ఫెయిల్‌ అయితే రివ్యూవర్స్‌ను ఆడిపోసుకోవడం ఏంటని మీడియా వర్గాల వారు నేలటిక్కెట్టు యూనిట్‌ సభ్యులను ప్రశ్నిస్తున్నారు.

సినిమా ఫ్లాప్‌ అయితే నిజాయితిగా ఒప్పుకున్న వాడు అసలైన హీరో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube