టీడీపీ స్వ‌యంకృతం.. జ‌గ‌న్‌కు ఆ జిల్లా స‌లాం

చేసుకున్న వారికి చేసుకున్నంత‌! అనేది తెలుగు సామెత‌.ఇప్పుడు ఈ సామెత ఖ‌చ్చితంగా తెలుగు దేశం నేత‌ల‌కు స‌రిపోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 Ysrcp Hawa Increase In Guntur District-TeluguStop.com

ఎందుకంటే.ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్టిన అధికారాన్ని త‌మ ఇష్టానుసారం వినియోగించుకోవ‌డం త‌మ్ముళ్లకు తెలిసినంతగా ఎవ‌రికీ తెలిద‌య ద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

అదేస‌మ‌యంలో పార్టీ ప‌రంగా అతి చేస్తూ.త‌మ ఇష్ట‌మే పార్టీ ఇష్ట‌మ‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా టీడీపీకి ఎదురు దెబ్బ‌త‌గిలేలా చేస్తోంది.

ఫ‌లితంగా రాజ‌ధానిలో అత్యంత కీల‌క‌మైన ఓ జిల్లా మొత్తం.విప‌క్ష నాయకుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఖాతాలోకి వెళ్లిపోతోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

వివ‌రాల్లోకి వెళ్తే.రాజ‌ధాని ప్రాంత జిల్లా అయిన గుంటూరులో టీడీపీ హ‌వా భారీ ఎత్తున సాగింది.ఫ‌లితంగా 2014 ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లాలో టీడీపీ ఉవ్వెత్తున ఎగిసి ప‌డింది.మొత్తం 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో 12 చోట్ల విజ‌యం సాధించింది.

దీంతో త‌మ‌కు తిరుగు లేద‌ని పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు భావించారు.ఈ క్ర‌మంలోనే ఈ జిల్లా నుంచి కీల‌క వ్య‌క్తుల‌ను మంత్రులుగా కూడా తీసుకున్నారు.

క‌ట్ చేస్తే.నాలుగేళ్లు తిరిగే స‌రికి ప‌రిస్థితి మారిపోయింది.

ఇప్పుడు టీడీపీ అంటేనే గుంటూరు ప్ర‌జ‌లు ఏవ‌గించుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఇక్క‌డ 12 మంది 12 ర‌కాలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెబుతున్నారు.

ఫ‌లితంగా వైసీపీకి అనుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని చెబుతున్నారు.

గుంటూరులోని పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన కొమ్మాల పాటి శ్రీధ‌ర్‌కు అధినేత చంద్ర‌బాబుతో అనుబంధం దాదాపు క‌ట్ అయిపోయింది.ఆయ‌న త‌న సొంత వ్యాపారాలు, సెటిల్మెంట్ల‌తో బిజీబిజీగా గ‌డ‌ప‌డంతోనే స‌రిపెడుతున్నారు.ఇక‌, పార్టీ కార్య‌క్ర‌మాల జోలికి కూడా పోవ‌డం లేదు.

ఇక‌, అంతో ఇంతో ప్ర‌జ‌ల్లో తిరిగే.తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావ‌ణ్ కుమార్‌పై కొంద‌రు చెప్పిన మాట‌లు విన్న పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆయ‌న‌ను ప‌క్క‌న పెడుతూ వ‌చ్చారు.

రాజధాని రైతుల ప‌క్షాన ఆయ‌న నిలిచి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప‌రిష్కారం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌ది అసంతృప్తి రాజ‌కీయం న‌డుస్తోంది.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు తిరుగులేక‌పోయినా.పార్టీపై మాత్రం ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు.

త‌న‌క‌న్నా జూనియ‌ర్ల‌కు ద‌క్కుతున్న ప‌దువులు త‌న‌ను వ‌రించ‌డం లేద‌ని ఆయ‌న ఫీల‌వుతు న్నారు.ఫ‌లితంగా పార్టీ త‌ర‌ఫున ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా ఆయ‌న ముందుకు రావ‌డం లేదు.

వేమూరు నుంచి గెలిచిన ప్ర‌స్తుత మంత్రి న‌క్కా ఆనంద బాబు మీడియా మీటింగుల‌తోనే స‌రిపెడుతున్నారు.రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌.

స్థానికంగా పెరుగుతున్న అస‌మ్మ‌తిని త‌ట్టుకోలేక చేతులు ఎత్తేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

తెనాలి ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్ ప‌రిస్థితి కూడా సేమ్ టు సేమ్ అన్న‌ట్టుగానే సాగుతోంది.

ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే,మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిద‌న్న ప‌రిస్థితి ఉంది.ఆయ‌న ఎదగ‌డం ప‌క్క‌న పెడితే.టీడీపీని ఎంత బ‌ద్నాం చేయాలో అంతా చేస్తున్నాడు.గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి.

స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం.ఎంపీ కాబోయి ఎమ్మెల్యే అయిన ఈయ‌న త‌న భ‌విష్య‌త్ ఎలా ఉంటుందో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

ఫ‌లితంగా పార్టీని, కేడ‌ర్‌ను అస్స‌లు ప‌ట్టించుకునే తీరిక కూడా లేకుండా పోయింది.చిల‌క‌లూరి పేట ఎమ్మెల్యే, మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు.

ఫ్యామిలీ రాజ‌కీయాల‌తో త‌ల‌కిందుల‌వుతున్నారు.ఆయ‌న ఎంత చెబుతున్నా.

ఆయ‌న ఫ్యామిలీ డామినేటెడ్ రాజ‌కీయాలు చేస్తోంది.ఫ‌లితంగా ఇప్ప‌టికే ఒక శాఖ నుంచి మ‌రో శాఖ‌కు ఆయ‌న‌ను బ‌దిలీ చేశారు.

స‌త్తెన ప‌ల్లి ఎమ్మెల్యే, స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు.త‌నదికాని న‌ర‌స‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గంలో వేలు పెడుతూ.రెండూ త‌న‌వే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డాన్ని ప్ర‌జ‌లుసైతం స‌హించ‌లేని ప‌రిస్థితి ఉంది.ఇలా టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని సాక్షాత్తూ చంద్ర‌బాబుకే నిఘా వ‌ర్గాలు స‌మాచారం అందించాయి.

మ‌రోప‌క్క ఈ జిల్లాలో పాగా వేసేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ చాలా చాక‌చ‌క్యంగా ముందుకు సాగుతున్నారు.దీనిని బ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో.

గుంటూరులో టీడీపీ హ‌వా త‌గ్గి.జ‌గ‌న్ పాగా వేసే చాన్స్ ఉంద‌ని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube