మనం ప్రతి రోజు ఎదో రకంగా టమోటాను వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం.వంటల్లో టమోటాను వేయటం వలన వంటకు రుచి రావటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.
అయితే టమోటాను వంటల్లో కాకుండా జ్యుస్ రూపంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.ప్రతి రోజు పరగడుపున ఒక గ్లాస్ టమోటా జ్యుస్ త్రాగితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
టమాటాల్లో బీటా కెరోటిన్, లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
వీటి కారణంగానే టమోటాకి ఎరుపు రంగు ఉంటుంది.టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు శరీరంలో కణజాలం నశించకుండా కాపాడతాయి.
అలాగే గుండె జబ్బులు రాకుండా కూడా కాపాడతాయి.
టమోటాలో ఉండే ఫైబర్ జీర్ణ క్రియ పనితీరును మెరుగుపరచి మలబద్దకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
టమోటాలో సమృద్ధిగా ఉండే ఫైటో న్యూట్రియంట్లు రక్తం గడ్డకట్టకుండా కాపాడతాయి.దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.
టమోటాలో సమృద్ధిగా ఉండే లైకోపీన్, విటమిన్ సి, ఇ, బీటాకెరోటిన్లు రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.టమాటాల్లో ఉండే బీటా కెరోటిన్, లుటీన్, విటమిన్ సిలు కంటి సమస్యలను పోగొడతాయి.
చూపు స్పష్టంగా ఉంటుంది.శుక్లాలు రాకుండా ఉంటాయి
.