రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి.నిన్నా మొన్నటి వరకూ కూడా టీడీపీ హవా కొనసాగుతూ వచ్చింది.
అదేంటో ఇప్పుడు ఒక్కసారిగా ఆ పరిస్థితి మారిపోయింది.తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో టిడిపికి ఎదురుగాలులు వేస్తున్నాయా అనే సందేహం వస్తోంది.
ఏ క్షణమైనా సరే పెను మార్పులు సంభవించే అవకాశం లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు.
ఈ విషయాలన్నిటిని పక్కన పెడితే…ఒక పక్క కేంద్రంతో ఎటూ తేల్చుకోలేక తలపట్టుకుంటున్న టిడిపికి ఇప్పుడు సొంత పార్టీ నేతల తీరుతో మరింత ఇబ్బందులు కలుగుతున్నాయి.
కొంతమంది ఎమ్మెల్యేల తీరు మరింత కలవరపెట్టేదిగా మారింది.ఎక్కడ తమ ఎమ్మెల్యేలు వైసీపిలో వేల్లిపోతారో అనే భయం ఇప్పుడు టిడిపిలో మొదలయ్యింది.అదునుచూసి వైసీపీ ఎక్కడ వాళ్లను లాగేసుకుంటుందోనన్న భయం కూడా పార్టీలో మొదలైంది…దానికి కారణం కూడా లేకపోలేదు తాజాగా వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
టిడిపిలో చేరి తన భవిష్యత్తు నాశనం చేసుకున్నానని ఆవేదన చెందారు…సభ్యత్వ నమోదు కోసం రూ.13.50లక్షలు చెల్లించామని.అయితే ఇప్పటి వరకూ ఆ గుర్తింపు కార్దు రాలేదని అయితే ఈ సొమ్ము మొత్తంని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు కాజేశారని అన్నారు.అయితే ఈ విషయంలో నేను ఖచ్చితంగా చెప్తున్నానని నాకు అబద్దాలు చెప్పే అవసరం లేదని అన్నారు.
చంద్రబాబు గారు చేస్తున అభివృద్ధి వలన పార్టీలో చేరుతున్నాం అని అందరు చెప్తున్నారు.కానీ నాకు అలా అబద్దాలు చెప్పే ఖర్మ పట్టలేదు.ఆత్మసాక్షిగా చెబుతున్నా.నేను టీడీపీకి అమ్ముడుపోయాను’ అని మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా అంటున్నారు.
అక్కడితే ఆగని మణిగాగాంధీ మరో సంచలన కామెంట్స్ చేశారు.త్వరలో రాష్ట రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయని అన్నారు.ఆరు నెలలు ఓపిక పట్టండి చాలు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.అంతేకాదు.
త్వరలో బద్వేలు ఎమ్మెల్యే జయరాముడు టీడీపీ నుంచి బయటకురాబోతున్నారని మరో బాంబు పేల్చారు…అయితే ఈ విషయంలో టిడిపిని సదరు ఎమ్మెల్యే ఇరకాటంలో పడేశారు.మరి ఆరు నెలలో ఆ పెను మార్పులు ఏమిటో వేచి చూడాలి
.