భారత దేశ ప్రధాని నరేంద్రమోడి మంగళవారం హైదరాబాద్ లో తెలంగాణా రాష్ట్ర నాకులతో ఎంతో సరదాగా గడిపారు.దేశంలోనే అతిపెద్ద మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చేసిన మోడీని రిసీవ్ చేసుకోవడానికి తెలంగాణా ప్రభుత్వ గణం.
అంతా బయలుదేరి వెళ్ళింది.వీరితో పాటు తెలంగాణా బిజేపి సీనియర్స్ కూడా ఉన్నారు.
మోడీ వారితో కొతసేపు ముచ్చటించారు.అయితే ప్రారంభోత్సవం చేస్తున్న సమయంలో మంత్రి కేటిఆర్ కనపడలేదు అని గమనించిన మోడీ కేటిఆర్ గురించి ఆరా తీశారు.
కేటిఆర్ రాగానే పక్కనే కూర్చోపెట్టుకుని చాలా సేపు ముచ్చటించారు కూడా.ఈ విషయాన్ని గమనిచిన కేసీఆర్ మాత్రం ఉబ్బి తబ్బిబ్బయ్యారు.
అయితే బిజేపి నాయకులకి మాత్రం ఒకింత ఇబ్బందికి గురయ్యారు అని టాక్ కూడా ఉంది
గ్లోబల్ సమ్మెట సదస్సు కోసం వచ్చిన మోడీ మొదట తెలుగులో అందరిని పలకరించి ఆశ్చర్యానికి గురిచేశారు.దక్షిణ భారతదేశంలో బిజెపి అంత బలంగా లేకపోయినా కార్యకర్తలు ప్రజలలో ఉండి పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం అన్నారు.
తెలంగాణ అభివృద్ధికి మా సహాయం తప్పకుండ ఉంటుంది అని చెప్పారు మోడీ.మోడీ ఎంతవరకు కేటిఆర్ తో మాట్లాడుతూ వచ్చారు తప్ప తెలంగాణా సీఎం అయిన కేసీఆర్ తో మాట్లాడక పోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
అయితే చాలా వరకూ కేటీఆర్ తోనే మోడీ మాట్లాడుతూ కనపడ్డారు.మోడీ ఇలా కేటిఆర్ తోనే ఎక్కువగా మాట్లాడటం వెనుక కారణం లేకపోలేదట
కేటిఆర్ వాగ్ధాటి.
ఎన్నో ఆర్ధిక.ఎకనామికల్ విషయాలమీద అనర్గళంగా మాట్లాడగల సత్తా ఉన్న వ్యక్తి కేటిఆర్.
ఒక విధంగా చుస్తే కెసీఆర్ కి కూడా తన కొడుకుని డామినేట్ చేయగల శక్తి లేదు అన్నది నిజం.అంతేకాకుండా ప్రజా సమస్యల మీద స్పదించే తీరు.
ప్రతిపక్షాలని ఎదుర్కునే సమయంలో తన ప్రవర్తన సరళి ఇలా ఒకటేమిటి ఒక బలమైన నాయకుడికి కావాల్సిన అనేకమైన క్వాలిటీస్ కేటిఆర్ లో ఉన్నాయి.ఈ విషయాలనే ఆధారంగానే తెలంగాణా యొక్క ఫ్యూచర్ నాయకుడు కేటీఆర్ అని మోడీ ఇప్పటికే గుర్తించినట్టు తెరాస నాయకులు సంతోషపడుతున్నారు.
కేటిఆర్ కి సంభందించిన ప్రతీ ఒక్క రిపోర్ట్ మోడీ టేబుల్ మీద ఉందట.వాటిని పరిశీలించిన మోడీ ఇప్పుడు కేటిఆర్ మీద ప్రత్యేక శ్రద్ద కనపరచడానికి కారణం అవుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు.
ఏది ఏమైనా మోడీ ఈ పర్యటనలో కేటిఆర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చలకి కారణం అవుతున్నాయి.ఎంతన్నా కేటిఆర్ తండ్రిని మించిన కొడుకు అయ్యాడు అనడంలో సందేహం లేదు.