పిల్లలు పెద్దయ్యాక ఆరోగ్యంగా ఉండాలంటే, చిన్నప్పటి నుంచే మంచి ఆహారం, అవసరమైన ఆహారం తినిపిస్తూ ఉండాలి.శరీరానికి లాభాన్ని కూర్చే ఏ ఆహారమైనా, చిన్నప్పుడు అలవాటు చేస్తేనే, ఓ వయసులోకి వచ్చాక కూడా ఆ అలవాటుని కంటిన్యూ చేస్తారు.
కాబట్టి పాలు మరవగానే కొన్ని ఆహారపు అలవాటు మొదలుపెట్టించాలి.అందులో ఒకటి బొప్పాయి తినటం.
మరి బొప్పాయి ఎందుకు తినాలని మీకో డౌట్ రావచ్చు.
* వాతావరణ మార్పిడి వలన, బయట ఎక్కువగా ఆడుకోవటం వలన పిల్లలకి రకరకాల ఇన్ఫెక్షన్స్ రావచ్చు.
బొప్పాయిలో విటమిన్ సి ఉంతుంది.ఈ విటమిన్ పిల్లలలో ఇమ్యునిటినీ మెరుగుపరిచి, సాద్యమైనంతవరకు ఇన్ఫెక్షన్స్ ని నివారిస్తుంది.
* బొప్పాయిలో ఫైబర్ కూడా బాగా ఉండటం వలన, తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.మెటబాలిజం సరైన ట్రాక్ లో ఉంటుంది.
* పిల్లలకు మలబద్ధకం సమస్య రావచ్చు.దీన్ని బొప్పాయితో కంట్రోల్ చేయవచ్చు.
రోజుకి రెండుపూటలు కొంచెం కొంచెం బొప్పాయి తిన్పించి మన ప్రయత్నం చేయవచ్చు.
* బొప్పాయిని తేనెతో కలిపి ఇస్తే, అది పేగులను శుభ్రంగా ఉంచుతుంది.
పిల్లలకు ఈ మిశ్రమం చాలా అవసరం.
* బొప్పాయిలో యాంటిఆక్సిడెంట్స్ బాగా దొరుకుతాయి.
ఇవి చిన్నప్పటినుంచే శరీరానికి చాలా అవసరం.
* ఈ ఫలం చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.
కాబట్టి మీ పిల్లల చర్మసౌందర్యం కోసమైనా బొప్పాయిని అలవాటు చేయండి.