బ్రహ్మానందం తెర మీద కనపడగానే ఆటోమేటిక్ గా మన ముఖం మీద చిరునవ్వు వస్తుంది.బ్రహ్మానందం బయట కూడా అందరిని నవ్విస్తూ ఉంటాడు.
అలాంటి బ్రహ్మానందం ఇప్పుడు జబర్దస్త్ షో పై ఫైర్ అవుతున్నాడు.అసలు విషయంలోకి వెళ్తే….
ఈ టీవీలో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో నటించే కమెడియన్స్ కి వెండితెర మీద మంచి అవకాశాలు వస్తున్నాయి.ఈ ప్రభావం సీనియర్ కమెడియన్స్ మీద పడింది.
ముఖ్యంగా ఈ ప్రభావం బ్రహ్మానందం మీద పడిందని సమాచారం.బ్రహ్మానందం జబర్దస్త్ షో మీద ఫైర్ అయ్యాడు కానీ ఆ షో లో నటించిన నటుల మీద మాత్రం కాదు.
ఎందుకంటే జబర్దస్త్ షో కారణంగా తనకు ఆఫర్స్ తగ్గిపోయాయని ఇటీవల కాలంలో ఎవరో కావాలని ప్రచారం చేస్తున్నారని, దానిలో ఏమాత్రం వాస్తవం లేదని బ్రహ్మానందం అంటున్నాడు.అంతేకాక ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం సినిమాల్లో కనపడటం తగ్గిపోయింది.
అయితే దీనికి వేరే కారణాలు ఉన్నాయి.ఏదైతేనే తనకు అవకాశాలు రాకపోవటానికి జబర్జస్త్ షో కాదని క్లారిటీ ఇచ్చేసాడు బ్రహ్మి.