గత కొన్ని రోజులుగా 69 సంస్కార్ కాలనీ సినిమా గురించి సోషల్ మీడియా లో పతాక స్థాయి లో చర్చ జరుగుతోంది.ఆ సినిమా ట్రైలర్ మరీ బూతు సినిమా లా అనిపించింది.
ఒక వివాహిత తమ ఇంట్లో అద్దెకు ఉండే కాలేజీ కుర్రాడి తో అక్రమ సంబందం పెట్టుకుంటుంది.భర్త ఆఫీస్ కు వెళ్లిన వెంటనే ఆమె అతడితో సాగించే సరసాలకు సంబంధించిన కథతో ఈ సినిమాను చూపించబోతున్నారు అంటూ ఆ ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది.
ఆ ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి ఇలాంటి సినిమాలు సమాజాన్ని తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి.సినిమా విడుదల చేయవద్దంటూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి సమయం లో సినిమా ను మార్చి 18వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.మరో మూడు రోజుల్లో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యం లో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు.
తాజాగా హీరోయిన్ ఎస్తర్ మీడియాతో మాట్లాడుతూ సినిమాలో తప్పుడు చూపించామని కొందరు భావిస్తున్నారు.కాని ఆడవారు ప్రస్తుత సమాజం లో ఎదుర్కొంటున్న విషయాలను చూపించడం జరిగింది.మగవారికి మాత్రమే పెళ్లి తర్వాత పరాయి అమ్మాయితో కోరికలు కలుగుతాయా.ఆడవారికి కూడా పెళ్లి అయినా కోరికలు కలుగుతాయి.ఆ విషయాన్ని చాలా మంది చెప్పలేక పోతారు.అదే విషయాన్ని తాము సినిమాలో చూపించాం.
ట్రైలర్ లో చూపించింది ఒకటి అయితే బయట ప్రచారం జరుగుతున్నది మరోటి అంటూ ఎస్తర్ అసంతృప్తి వ్యక్తం చేసింది.జనాల దృష్టి ఇంకా మారకుండా ఆడవారిని అణగద్రొకే విధంగానే చూస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది.
ఈ సినిమా యూత్ ఆడియన్స్ కు మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా తప్పకుండా నచ్చుతుంది అని నమ్మకం ను ఎస్తర్ వ్యక్తం చేసింది