అమరవీరుల గాధలను వక్రీకరించి తెరకెక్కించే ప్రయత్నం మంచిదికాదని అల్లూరి సీతారామరాజు పినతల్లి మనువడు గొట్టిముక్కల సూర్యనారాయణరాజు తీవ్రంగా ఖండించారు.ప్రత్యేక హోదా సాధన సమితి నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చరిత్రకారులు, స్వాతంత్ర్య సమరయోధుల పాత్రలను వక్రీకరించి డబ్బు సంపాదించాలనే ఆపేక్ష మంచిది కాదన్నారు.ఊహలు వేరు వాస్తవాలు వేరని గుర్తించాలన్నారు.
గాంధీ, నేతాజీ,నెహ్రూలు బ్రిటిషర్లతో కత్తియుద్దం చేసినట్టు సినిమా తీసుకోమని విమర్శించారు.స్వాతంత్ర్య సమరయోధులతో డాన్సులు వేయించడం క్షమార్హం కాదన్నారు.
అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేయాలనుకుంటే రాజమౌళి పేరుతో చేసుకోవచ్చన్నారు
.






