ప్రతిష్టాత్మక గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2021 రేసులో ఇద్దరు భారతీయ ఉపాధ్యాయులు షార్ట్ లిస్ట్ అయ్యారు.వీరిలో ఒకరు బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన మ్యాథమేటిక్స్ టీచర్ సత్యం మిశ్రా కాగా, రెండవ వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన సామాజిక అధ్యయనం, ఇంగ్లీష్, గణిత ఉపాధ్యాయురాలు మేఘనా ముసునూరి.
అంతేకాదు ఫౌంటేన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ ఛైర్ పర్సన్‌గా మేఘన వ్యవహరిస్తున్నారు.
సత్యం మిశ్రా.
ప్రపంచాన్ని పిల్లలు చూసే విధానాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు.అలాగే మెజారిటీ విద్యార్ధులు భయపడే సబ్జెక్ట్ అయిన గణితాన్ని వారికి సులభంగా అర్థమయ్యేలా చక్కని గుణకారాన్ని ఆయన ఉపయోగిస్తారు.
ఇక మేఘన విషయానికి వస్తే.ఫౌంటేన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ ఛైర్ పర్సన్‌గా, మానవతావాదిగా.
అలాగే గూగుల్ మహిళా పారిశ్రామికవేత్తల కోసం హైదరాబాద్ ఛాంపియన్‌గా వ్యవహరిస్తున్నారు.
యునెస్కో భాగస్వామ్యంతో వార్కే ఫౌండేషన్ ‘‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’’ ని అందజేస్తోంది.బహుమతి విలువ 1 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 7.35 కోట్లు).ఈ అవార్డు కోసం 121 దేశాల నుంచి 8000 నామినేషన్లు, దరఖాస్తులు నిర్వాహకులకు అందాయి.గురువారం 50 మందితో షార్ట్ లిస్ట్ చేసిన జాబితాను నిర్వాహకులు ప్రకటించారు.
వీరిలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
కాగా, ఈ ఏడాది గ్లోబల్ టీచర్ ప్రైజ్‌కు అనుబంధంగా.
గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్‌ను నెలకొల్పారు.ఇందులో భారతదేశానికి చెందిన నలుగురు విద్యార్ధులు టాప్ 50 జాబితాలో స్థానం దక్కించుకున్నారు.

ఇక గతేడాది గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020 భారత్‌కే దక్కడం విశేషం.మహారాష్ట్రకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్సింగ్ డిసలేను ఈ అవార్డు వరించింది.పాఠశాలలో విద్యార్థుల హాజరు నూరు శాతం ఉండేలా చేయడమే కాకుండా, పాఠ్యపుస్తకాలకు క్యూఆర్ కోడ్ను ప్రవేశ పెట్టి విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టినందుకు గానూ రంజిత్ సింగ్ డిసలేను ఈ బహుమతి లభించింది.ఈ బహుమతి కోసం 140 దేశాల నుంచి మొత్తం 12 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి.
ఈ అవార్డు తుది జాబితాకు మొత్తం 10మందిని ఎంపిక చేయగా… వారందరిలో రంజిత్ సింగ్ డిసలే విజేతగా నిలిచాడని నిర్వాహకులు ప్రకటించారు.