దత్తపుత్రుడు పవన్‌తో చంద్రబాబు తిట్టేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.ప్యాకేజీ తీసుకొని పవన్ బూతులు తిడుతున్నారని ఆరోపించారు, ముఖ్యమంత్రిని తిడితే నేను ఊరుకుంటామా అని ప్రశ్నించారు.
జయంతికి వర్ధంతికి తేడా తెలియని లోకేష్ జగన్‌ను విమర్శిస్తున్నారని అన్నారు, ఎమ్మెల్యేగా గెలవలేని చేతకాని వ్యక్తి లోకేష్ అని అన్నారు.లోకేష్ గురించి తెలిసే చంద్రబాబు పవన్ ను ప్రోత్సహిస్తున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ పెళ్లి కాదు పులి అని చెప్పారు.పిల్లికి పులికి తేడా తెలియకపోతే ఆహారం అయిపోతారని హెచ్చరించారు, రాజధాని పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని అన్నారు.
తిరుమలలో అమిత్ షా పై చెప్పులు వేయించిన వ్యక్తి చంద్రబాబు అని, మద్యాన్ని ఏరులై పారించిన వ్యక్తి అని విమర్శించారు.అభివృద్ధిపై చర్చలు జరగకుండా ఉండేందుకే కావాలని బూతులు తిడుతూ రచ్చ చేస్తున్నారని అన్నారు.