విశాఖ నుంచి గన్నవరం చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శల జల్లు కురిపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పొలిటికల్ పార్టీగా బాధ్యతను నెరవేరుస్తామని, వైసీపీ పార్టీ విశాఖ గర్జన కార్యక్రమం పెట్టిన తర్వాతనే తాము జనవాణి కార్యక్రమం పెట్టామని అనడం సరికాదని విమర్శించారు.
తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం వైసీపీకి సరైన పద్ధతి కాదని విమర్శించారు.వైసీపీ పార్టీకే కాదు ఏ పార్టీకి ఎవరికీ ఇబ్బంది కానీ తొలగించాలని ఉద్దేశం ఎప్పుడూ లేదు అని అన్నారు.
శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే, ఆ విషయంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని, రాజకీయాల కోసం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.